భారతితో నమ్రతా మీటింగ్‌…

ఏపీలో మరో ఇంట్రెస్టింగ్‌. సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతితో సినీహీరో మహేష్‌ బాబు భార్య నమ్రత భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లి ఆమెని కలిశారు.

హీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్‌ వివరాలు వైఎస్‌ భారతికి నమ్రత వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం సహకారం అందించాలని ఆమె భారతిని కోరారు.

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైంది. సినీ పరిశ్రమ నుంచి పెద్దలు ఎవరూ వెళ్లి సీఎం జగన్‌ను కలవలేదు. అయితే ఈ మధ్యనే సైరా విడుదల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి కుటుబంతో కలిసి వెళ్లి జగన్‌ను కలిశారు. లంచ్‌ మీటింగ్‌లో దాదాపు గంట పాటు సీఎంతో సమావేశమయ్యారు.

చిరంజీవి అలా వెళ్లి ఇలా కలిశారో ఇప్పుడు నమ్రత వెళ్లి జగన్‌ భార్య భారతితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి సినీ పరిశ్రమ నుంచి జగన్‌ను కలవడం మొదలైంది. లేటుగానైనా సినీ పరిశ్రమ మేల్కొంది.

మహేష్‌బాబు ఫ్యామిలీ ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు సపోర్టుగా ఉండేది. ఇటీవల కృష్ణ సతీమణి విజయనిర్మల చనిపోయినప్పుడు కూడా జగన్‌ వెళ్లి పరామర్శించారు. మొన్నటి ఎన్నికల దాకా సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా వైసీపీలో ఉన్నారు. కానీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఇటు మహేష్‌బాబు బావ గల్లాజయదేవ్‌ గుంటూరు టీడీపీ ఎంపీ.

మొత్తానికి కృష్ణ ఫ్యామిలీ తరపున నమ్రతా రాయబారిగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.