Telugu Global
National

బీజేపీ రాజకీయం?... అజయ్‌ చౌతాలకు పేరోల్ మంజూరు

హర్యానాలో హంగ్‌ అసెంబ్లీ జేజేపీ పంట పడిస్తోంది. సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ… జననాయక్ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. జేజేపీ అధినేత దుశ్వంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. దాంతో మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తూనే దుశ్వంత్ చౌతాలా కొత్త మెలిక పెట్టారు. తాము మద్దతు ఇవ్వాలంటే తన తాత ఓంప్రకాశ్‌ చౌతాలా, తన తండ్రి అజయ్ చౌతాలాను కేసుల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ పెట్టాడు. వారిని జైలు నుంచి విడుదల […]

బీజేపీ రాజకీయం?... అజయ్‌ చౌతాలకు పేరోల్ మంజూరు
X

హర్యానాలో హంగ్‌ అసెంబ్లీ జేజేపీ పంట పడిస్తోంది. సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ… జననాయక్ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. జేజేపీ అధినేత దుశ్వంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. దాంతో మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తూనే దుశ్వంత్ చౌతాలా కొత్త మెలిక పెట్టారు. తాము మద్దతు ఇవ్వాలంటే తన తాత ఓంప్రకాశ్‌ చౌతాలా, తన తండ్రి అజయ్ చౌతాలాను కేసుల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ పెట్టాడు. వారిని జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌ను బీజేపీ ముందుంచారు.

ఈ డిమాండ్‌కు బీజేపీ తలొగ్గినట్టుగానే కనిపిస్తోంది. కేంద్రం తలుచుకుంటే కేసులెంత పని అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. జేజేపీ మద్దతు ఇవ్వగానే నేడు అజయ్ చౌతాలకు పెరోల్ లభించింది. రెండు వారాల పాటు అజయ్ చౌతాలాకు పెరోల్ లభించింది. సరిగ్గా ఇప్పుడే పెరోల్ రావడం చర్చనీయాంశమైంది. కుమారుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెరోల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

ఓంప్రకాశ్‌ చౌతాలా, అజయ్ చౌతాలకు టీచర్ల అక్రమ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో 2015లో పదేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి వారు తీహార్ జైలులో ఉన్నారు. ఎన్నికల్లో జేజేపీ సత్తా చాటగానే దుశ్వంత్ చౌతాలా జైలుకు వెళ్లి తన తాత, తండ్రిని కలిశారు. పెరోల్ నేపథ్యంలో నేడు లేదా రేపు ఉదయం అజయ్ చౌతాల తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.

First Published:  26 Oct 2019 5:36 AM GMT
Next Story