Telugu Global
NEWS

ఆస్ట్రేలియా ప్రధాని వాటర్ బాయ్ అవతారం

శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్ లో స్కాట్ మోరిసన్ సంచలనం క్రికెట్ ను విపరీతంగా అభిమానించే ఆస్ట్ర్రేలియాలో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకొంది. ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో తలపడటానికి వచ్చిన శ్రీలంకజట్టు…కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ వేదికగా…ఆస్ట్ర్రేలియన్ ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. స్వయానా ఆస్ట్ర్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వాటర్ బాయ్ అవతారం ఎత్తి సంచలనం సృష్టించడమే కాదు…క్రికెట్ అంటే తనకు ఎంత అభిమానమో చాటుకొన్నారు. శ్రీలంక బ్యాటింగ్ […]

ఆస్ట్రేలియా ప్రధాని వాటర్ బాయ్ అవతారం
X
  • శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్ లో స్కాట్ మోరిసన్ సంచలనం

క్రికెట్ ను విపరీతంగా అభిమానించే ఆస్ట్ర్రేలియాలో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకొంది. ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో తలపడటానికి వచ్చిన శ్రీలంకజట్టు…కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ వేదికగా…ఆస్ట్ర్రేలియన్ ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. స్వయానా ఆస్ట్ర్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వాటర్ బాయ్ అవతారం ఎత్తి సంచలనం సృష్టించడమే కాదు…క్రికెట్ అంటే తనకు ఎంత అభిమానమో చాటుకొన్నారు.

శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…ఆట 16వ ఓవర్ విరామంలో…ఓ క్రికెటర్ కు బదులుగా ఆస్ట్ర్రేలియా ప్రధానే వాటర్ బాటిల్స్ తీసుకొని గ్రౌండ్ లోకి వచ్చారు. దాహంతో ఉన్న కంగారూ క్రికెటర్లకు వాటర్ బాటిల్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు.

వాటర్ బాయ్ రూపంలో తమ దేశప్రధానిని చూసి కొందరు ఆస్ట్ర్రేలియా ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురికాగా…మరికొందరు నమ్మలేని వాస్తవాన్ని చూసినట్లుగా.. ముసిముసిగా నవ్వుకొన్నారు.

విదేశాలలో ప్రధానమంత్రులు ఇంత నిరాడంబరంగా ఉంటే…ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా పేరున్న మనదేశంలో మాత్రం ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ…బ్రిటీష్ రాణే తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు.

First Published:  26 Oct 2019 5:34 AM GMT
Next Story