Telugu Global
Cinema & Entertainment

సూపర్ మచ్చి అంటున్న కల్యాణ్ దేవ్

అప్పుడెప్పుడో విజేత అనే సినిమా చేశాడు చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్. ఆ తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. ఆ సినిమా ద్వారా తన డ్రాబ్యాక్స్ ఏంటో తెలుసుకున్న కల్యాణ్ దేవ్, ఇన్నాళ్లూ ట్రైనింగ్ తీసుకున్నాడు. మళ్లీ రాటుదేలాడు. ఇప్పుడు మరోసారి ముఖానికి రంగేసుకున్నాడు. అలా తన రెండో ప్రయత్నంగా కల్యాణ్ దేవ్ తెరకెక్కించిన సినిమా సూపర్ మచ్చి. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ […]

సూపర్ మచ్చి అంటున్న కల్యాణ్ దేవ్
X

అప్పుడెప్పుడో విజేత అనే సినిమా చేశాడు చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్. ఆ తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. ఆ సినిమా ద్వారా తన డ్రాబ్యాక్స్ ఏంటో తెలుసుకున్న కల్యాణ్ దేవ్, ఇన్నాళ్లూ ట్రైనింగ్ తీసుకున్నాడు. మళ్లీ రాటుదేలాడు. ఇప్పుడు మరోసారి ముఖానికి రంగేసుకున్నాడు. అలా తన రెండో ప్రయత్నంగా కల్యాణ్ దేవ్ తెరకెక్కించిన సినిమా సూపర్ మచ్చి. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు కల్యాణ్ దేవ్. పులివాసు ఈ సినిమాకు దర్శకుడు. సినిమా షూటింగ్ కూడా దాదాపు 50శాతం పూర్తయింది. ఆ మూవీకి సూపర్ మచ్చి అనే టైటిల్ ఫిక్స్ చేసి ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ డిజైన్ రిలీజ్ చేశారు.

అన్నట్టు ఈ సినిమాలో ముందు మెహ్రీన్ ను తీసుకున్నారు. తర్వాత ఏమైందో, ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తిని తీసుకున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. త్వరలోనే మిగతా షూటింగ్ కూడా పూర్తిచేసి, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

First Published:  26 Oct 2019 3:24 AM GMT
Next Story