గడ్డమే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్

ఇస్మార్ట్ శంకర్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రామ్ ఇప్పుడు కొత్త సినిమా కోసం సిద్ధమౌతున్నాడు. త్వరలోనే అతడు చేయబోయే కొత్త సినిమా వివరాలు అధికారికంగా బయటకు రాబోతున్నాయి. ఇంతకీ రామ్ చేయబోయేది ఏ సినిమానో తెలుసా? తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు రామ్. తనకు నేను శైలజ లాంటి హిట్ అందించిన కిషోర్ తిరుమలకు ఈ రీమేక్ బాధ్యతల్ని అప్పగించాడు.

అయితే ఇక్కడే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు రామ్. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తడం సినిమాకు ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించాడు. ఉన్నది ఉన్నట్టు తీయడమే కిషోర్ తిరుమల పని. అయితే రామ్ గెటప్ మాత్రం కొత్తగా ఉండబోతోంది. ఇస్మార్ట్ శంకర్ కోసం గడ్డం పెంచిన రామ్, తన కొత్త సినిమాకు కూడా అదే గడ్డాన్ని కొనసాగించబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో హీరోకు గడ్డం ఉండదు.

త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ తో స్వయంగా రామ్ ఓ ప్రకటన చేయబోతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిషోర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.