Telugu Global
National

కమ్మరాజ్యంలో వర్మ సంచలనం

ట్రయిలర్స్ తో సంచలనాలు సృష్టించడం వర్మకు కొత్తకాదు. సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. రిలీజ్ కు ముందు ట్రయిలర్ తో దుమ్ముదులపడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. ఈసారి కూడా అదే పనిచేశాడు ఆర్జీవీ. దీపావళి సందర్భంగా విడుదల చేసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రయిలర్ తో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తున్న ప్రముఖ రాజకీయ నేతలంతా ఈ ట్రయిలర్ లో ఉన్నారు. సరిగ్గా 5 నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల నేపథ్యంలో […]

కమ్మరాజ్యంలో వర్మ సంచలనం
X

ట్రయిలర్స్ తో సంచలనాలు సృష్టించడం వర్మకు కొత్తకాదు. సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. రిలీజ్ కు ముందు ట్రయిలర్ తో దుమ్ముదులపడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. ఈసారి కూడా అదే పనిచేశాడు ఆర్జీవీ. దీపావళి సందర్భంగా విడుదల చేసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రయిలర్ తో సంచలనం సృష్టించాడు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తున్న ప్రముఖ రాజకీయ నేతలంతా ఈ ట్రయిలర్ లో ఉన్నారు. సరిగ్గా 5 నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమా ఉంటుందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది.

ఎప్పట్లానే వర్మ వాయిస్ ఓవర్ తో గంభీరంగా ప్రారంభమైంది ట్రయిలర్. అయితే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. కేవలం చంద్రబాబు, జగన్, పవన్ పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వకుండా మరికొన్ని ఇతర రాజకీయ నాయకుల పాత్రల్ని కూడా ప్రవేశపెట్టాడు వర్మ. మరీ ముఖ్యంగా కేఏ పాల్, నారా లోకేష్ పాత్రల్ని పెట్టి సినిమాపై ఇంట్రెస్ట్ జనరేట్ చేశాడు. అంతేకాదు.. చివరికి నారా బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్, మోడీ, అమిత్ షా పాత్రల్ని కూడా పెట్టి సంచలనం సృష్టించాడు.

ఇవన్నీ ఒకెత్తయితే.. ట్రయిలర్ లో వర్మ చూపించిన ఓ సీన్ మరో ఎత్తు. ఏడుస్తూ అన్నం తింటున్న లోకేష్ దగ్గరకు చంద్రబాబు వచ్చి, ఆప్యాయంగా పప్పు వడ్డిస్తాడు. ఈ సన్నివేశం టోటల్ ట్రయిలర్ కే హైలెట్ గా నిలిచింది. ఇలా 2 నిమిషాల 50 సెకెన్ల ట్రయిలర్ లో చాలా సంచలనాలే చూపించాడు వర్మ. ఈ దీపావళికి రాజకీయ నాయకుల గుండెల్లో నిజమైన బాంబులు పేల్చాడు.

ట్రయిలర్ హిట్ అయిపోయింది. ఇక ఆ పాత్రలతో వర్మ ఎలాంటి డైలాగులు చెప్పించాడు, ఫైనల్ గా ఏం చూపించాడనే విషయంపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

First Published:  27 Oct 2019 1:16 AM GMT
Next Story