Telugu Global
Cinema & Entertainment

అదే టైటిల్ ప్రకటించిన నాగశౌర్య

నాగశౌర్య కొత్త సినిమాకు అశ్వథ్థామ అనే పేరు ప్రచారంలో ఉంది. దాదాపు సినిమా లాంఛ్ అయినప్పట్నుంచి ఈ టైటిల్ నలుగుతూనే ఉంది. అయితే టైటిల్ పై యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు నాగశౌర్య తన కొత్త సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు. అందరి అంచనాల్ని నిజం చేస్తూ, తన సినిమాకు అశ్వథ్థామ అనే టైటిల్ నే ప్రకటించాడు. దీపావళి సందర్భంగా టైటిల్ లోగో డిజైన్ కూడా రిలీజ్ చేశాడు. రమణతేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ […]

అదే టైటిల్ ప్రకటించిన నాగశౌర్య
X

నాగశౌర్య కొత్త సినిమాకు అశ్వథ్థామ అనే పేరు ప్రచారంలో ఉంది. దాదాపు సినిమా లాంఛ్ అయినప్పట్నుంచి ఈ టైటిల్ నలుగుతూనే ఉంది. అయితే టైటిల్ పై యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు నాగశౌర్య తన కొత్త సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు. అందరి అంచనాల్ని నిజం చేస్తూ, తన సినిమాకు అశ్వథ్థామ అనే టైటిల్ నే ప్రకటించాడు. దీపావళి సందర్భంగా టైటిల్ లోగో డిజైన్ కూడా రిలీజ్ చేశాడు.

రమణతేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగశౌర్య చేస్తున్న సినిమా ఇది. శౌర్య సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే సినిమా షూటింగ్ లో నాగశౌర్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అతడు గాయపడినప్పుడే ఇదొక యాక్షన్ సినిమా అనే విషయం అందరికీ తెలిసింది. నిజమే.. ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు శౌర్య.

సినిమాలో ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతోంది. పైగా సినిమాలో తండ్రికొడుకుల సెంటిమెంట్ కూడా ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. టీజర్ రిలీజ్ అయితే తప్ప అశ్వథ్థామ టైటిల్ ఎందుకు పెట్టారు, ఏ జానర్ సినిమా అనే విషయంపై స్పష్టత రాదు. అన్నట్టు ఈ సినిమా కథను నాగశౌర్య స్వయంగా రాసుకున్నాడు.

First Published:  27 Oct 2019 1:27 AM GMT
Next Story