Telugu Global
NEWS

రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత

బాల్ బాయ్ టు చాంపియన్ 103 టైటిల్స్ నెగ్గిన స్విస్ స్టార్ ప్రపంచ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతున్నాడు. 38 ఏళ్ల లేటు వయసులోనూ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. తన సుదీర్ఘ కెరియర్ లో 103 ఏటీపీ టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి చాటిచెప్పాడు. 2019 స్విస్ ఇన్ డోర్ టోర్నీ ఫైనల్స్ లో ఆస్ట్ర్రేలియా యువఆటగాడు అలెక్స్ డి మినోర్ […]

రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత
X
  • బాల్ బాయ్ టు చాంపియన్
  • 103 టైటిల్స్ నెగ్గిన స్విస్ స్టార్

ప్రపంచ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతున్నాడు. 38 ఏళ్ల లేటు వయసులోనూ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. తన సుదీర్ఘ కెరియర్ లో 103 ఏటీపీ టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి చాటిచెప్పాడు.

2019 స్విస్ ఇన్ డోర్ టోర్నీ ఫైనల్స్ లో ఆస్ట్ర్రేలియా యువఆటగాడు అలెక్స్ డి మినోర్ ను 6-2, 6-2తో అలవోకగా ఓడించి తన కెరియర్ లో 10వసారి స్విస్ ఇన్ డోర్స్ ట్రోఫీ అందుకొన్నాడు.

బాల్ బాయ్ టు చాంపియన్…

టెన్నిస్ ఆడటమే ఊపిరిగా భావించే ఫెదరర్ తాను బాల్ బాయ్ గా పనిచేసిన బాసెల్ స్టేడియంలోనే విజేతగా పదవసారి స్విస్ ఇన్ డోర్ టైటిల్ అందుకోడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు విజయానంతరం చెప్పాడు.

స్విస్ ఇన్ డోర్స్ టోర్నీలో 15వసారి పాల్గొన్న ఫెదరర్ వరుసగా 13వసారి ఫైనల్స్ కు అర్హత సాధించడే కాదు…10వసారి విన్నర్ గా నిలిచాడు.

సెమీఫైనల్లో 6-4, 6-4తో స్టెఫానోస్ సిటిస్ పాస్ ను చిత్తు చేసిన ఫెదరర్ కు ఫైనల్లో పోటీనే లేకుండా పోయింది.

రోజర్ ఫెదరర్ కు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా…మొత్తం 103 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు ఉంది. కెరియర్ లో 1500కు పైగా మ్యాచ్ లు ఆడిన తొలిఆటగాడిగా ఫెదరర్ ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటికే సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించిన ఫెదరర్…2019 సీజన్లో 51 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో నిలిచాడు.

First Published:  27 Oct 2019 8:48 PM GMT
Next Story