Telugu Global
CRIME

ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కూతురు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిందో యువతి. ఈ ఘటన హయత్‌నగర్‌లో జరిగింది. లారీ డ్రైవర్ శ్రీనివాస్ నల్లగొండ జిల్లా రామన్నపేట నుంచి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కుటుంబంతో ఉంటున్నారు. లారీ డ్రైవర్‌ కావడంతో డ్యూటీకి కొద్దిరోజుల పాటు వెళ్లి వస్తుంటాడు. అతడి కుమార్తె ఇటీవల ఒక యువకుడితో ప్రేమలో పడింది. అతడితో కలిసి తిరుగుతోంది. ఈ విషయం గుర్తించిన తల్లి రజిత… తన కూతురిని మందలించింది. కూతురు, ఆమె ప్రియుడు […]

ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కూతురు
X

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిందో యువతి. ఈ ఘటన హయత్‌నగర్‌లో జరిగింది. లారీ డ్రైవర్ శ్రీనివాస్ నల్లగొండ జిల్లా రామన్నపేట నుంచి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కుటుంబంతో ఉంటున్నారు.

లారీ డ్రైవర్‌ కావడంతో డ్యూటీకి కొద్దిరోజుల పాటు వెళ్లి వస్తుంటాడు. అతడి కుమార్తె ఇటీవల ఒక యువకుడితో ప్రేమలో పడింది. అతడితో కలిసి తిరుగుతోంది. ఈ విషయం గుర్తించిన తల్లి రజిత… తన కూతురిని మందలించింది. కూతురు, ఆమె ప్రియుడు ఇంట్లో ఉండగా చూసి గట్టిగా మందలించడంతో తల్లిని చంపేసింది. తన ప్రేమ వ్యవహారం తండ్రితో చెబుతుందన్న భయంతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. మూడు రోజుల పాటు ఇంట్లోనే శవాన్ని ఉంచింది. ఆ మూడు రోజులు ప్రియుడు కూడా ఆమెతోనే ఉన్నాడు.

శవం దుర్వాసన రావడం మొదలవడంతో ప్రియుడితో కలిసి తీసుకెళ్లి స్వగ్రామం రామన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌పై వేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను విశాఖ టూర్‌కు వెళ్లానని….. వచ్చేలోగా తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఇంతలో ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌… తన కుమార్తెపై అనుమానంతో గట్టిగా నిలదీశాడు. దాంతో అసలు నిజం చెప్పేసింది. పోలీసులు అమ్మాయిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి విచారించగా… నేరం అంగీకరించారు.

First Published:  28 Oct 2019 4:18 AM GMT
Next Story