Telugu Global
NEWS

ప్రపంచ టీ-20కి పాపువా-న్యూగినియా అర్హత

దుబాయ్ అర్హత టోర్నీలో టాపర్ గా పీఎన్జీ ఆస్ట్ర్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు…క్రికెట్ పసికూన పాపువా -న్యూగినియా తొలిసారిగా అర్హత సంపాదించింది. దుబాయ్ వేదికగా ముగిసిన ఎనిమిది దేశాల అర్హత టోర్నీ లీగ్ లో పాపువా-న్యూగినియా టాపర్ గా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టో్ర్నీ ఆఖరి లీగ్ పోటీలో కెన్యాపై 45 పరుగుల తేడాతో పాపువా-న్యూగినియా సంచలన విజయం సాధించింది. ఒకదశలో 19 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి…పీకలోతు […]

ప్రపంచ టీ-20కి పాపువా-న్యూగినియా అర్హత
X
  • దుబాయ్ అర్హత టోర్నీలో టాపర్ గా పీఎన్జీ

ఆస్ట్ర్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు…క్రికెట్ పసికూన పాపువా -న్యూగినియా తొలిసారిగా అర్హత సంపాదించింది.

దుబాయ్ వేదికగా ముగిసిన ఎనిమిది దేశాల అర్హత టోర్నీ లీగ్ లో పాపువా-న్యూగినియా టాపర్ గా నిలిచింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టో్ర్నీ ఆఖరి లీగ్ పోటీలో కెన్యాపై 45 పరుగుల తేడాతో పాపువా-న్యూగినియా సంచలన విజయం సాధించింది.

ఒకదశలో 19 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి…పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన పాపువా- న్యూగినియా అన్యూహ్యంగా పుంజుకొని భారీవిజయం నమోదు చేసింది.

పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశమైన పాపువా-న్యూగినియాలో 19వ దశాబ్దం నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించారు. ఐసీసీలో సభ్యత్వం పొందిన పాపువా- న్యూగినియాకు.. ఆస్ట్ర్రేలియాకు చెందిన జో డాస్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

First Published:  27 Oct 2019 11:29 PM GMT
Next Story