Telugu Global
NEWS

జగన్ ప్రభుత్వం చొరవ... వారి దశ తిరిగింది...

చిత్తశుద్ది ఉంటే మన పాలకులు ఏమైనా చేయగలరు. తెలంగాణలోని సిరిసిల్ల చేనేతన్నలను బతికించేందుకు బతుకమ్మ చీరలు సహా ప్రభుత్వానికి అవసరమైన బట్ట, గురుకులాలు, పాఠశాలలకు స్కూల్ యూనిఫాంలను అందించే కాంట్రాక్టును నేతన్నలకు అందించి వారిని ఆదుకున్నారు.. ఇలా ప్రభుత్వమే చేనేత కార్మికులకు ఉపాధినిస్తోంది. అచ్చం అలాగే ఏపీ చేనేత కార్మికులకు ఆదుకునేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విస్తృతంగా అమ్మకాలు జరిపే ఈకామర్స్ దిగ్గజాలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లతో ఏపీ […]

జగన్ ప్రభుత్వం చొరవ... వారి దశ తిరిగింది...
X

చిత్తశుద్ది ఉంటే మన పాలకులు ఏమైనా చేయగలరు. తెలంగాణలోని సిరిసిల్ల చేనేతన్నలను బతికించేందుకు బతుకమ్మ చీరలు సహా ప్రభుత్వానికి అవసరమైన బట్ట, గురుకులాలు, పాఠశాలలకు స్కూల్ యూనిఫాంలను అందించే కాంట్రాక్టును నేతన్నలకు అందించి వారిని ఆదుకున్నారు.. ఇలా ప్రభుత్వమే చేనేత కార్మికులకు ఉపాధినిస్తోంది.

అచ్చం అలాగే ఏపీ చేనేత కార్మికులకు ఆదుకునేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విస్తృతంగా అమ్మకాలు జరిపే ఈకామర్స్ దిగ్గజాలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్ లైన్ ద్వారా ఏపీలోని చేనేతలు తయారు చేసిన చేనేత వస్త్రాల అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. నవంబర్ 1 నుంచి ఈ అమ్మకాలు ఈ రెండు ఈకామర్స్ లలో లభ్యం కానున్నాయి.

ఎన్నికలకు ముందే చేనేత రంగం దశ, దిశ మారుస్తానని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు ఈ కామర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తుంది. అక్కడి నుంచి అమేజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు సాగిస్తారు.

రూ.500 నుంచి రూ.20,000 వరకు తక్కువ ధరలోనే ఈ చేనేత వస్తువుల ధరలు ఉన్నాయి. దీంతో కస్టమర్లు తక్కువ ధరకే దొరికే ఏపీ తయారీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

First Published:  28 Oct 2019 5:03 AM GMT
Next Story