Telugu Global
National

ఆమ్రపాలికి అరుదైన అవకాశం

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా తెలంగాణ కేడర్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి, డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ బ్యాచ్ లోకి చేరి సంచలనం సృష్టించారు. ఎవ్వరూ ఊహించని విధంగా అతిపిన్న వయసులోనే కేంద్రంలో అత్యున్నత పదవిని సంపాదించి ఔరా అనిపించారు. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి మొన్నటి ఎన్నికల వరకు ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కార్యాలయంలో జాయింట్‌ సెక్రెటరీగా లూప్ లైన్ పోస్టులోకి మారారు. ఆ తర్వాత […]

ఆమ్రపాలికి అరుదైన అవకాశం
X

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా తెలంగాణ కేడర్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి, డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ బ్యాచ్ లోకి చేరి సంచలనం సృష్టించారు. ఎవ్వరూ ఊహించని విధంగా అతిపిన్న వయసులోనే కేంద్రంలో అత్యున్నత పదవిని సంపాదించి ఔరా అనిపించారు.

తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి మొన్నటి ఎన్నికల వరకు ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కార్యాలయంలో జాయింట్‌ సెక్రెటరీగా లూప్ లైన్ పోస్టులోకి మారారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కావడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు.

తాజాగా ఆమ్రపాలికి అద్భుతమైన పోస్టింగ్ దక్కింది. ఏకంగా కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ లో డిప్యూటీ సెక్రెటరీగా ఆమ్రపాలిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈమె ఏకంగా ప్రదాని నరేంద్రమోడీకే రిపోర్ట్ చేసే పోస్టును దక్కించుకోవడం విశేషం. నాలుగేళ్ల పాటు ఆమ్రపాలి ఈ పోస్టులో ఉంటారు..

తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమ్రపాలిని కేంద్ర సర్వీసుల్లో చేరడానికి వీలుగా రిలీవ్ చేసింది. దీంతో కేంద్రంలో అత్యున్నత పదవిలో ఈ డైనమిక్ ఆఫీసర్ చేరబోతోంది.

వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ఆమె తన తోటి బ్యాచ్ మేట్, ఐపీఎస్ అయిన సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు. ఆయన గుజరాత్ పక్కనే ఉండే కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ అండ్ డామన్ లో ఎస్పీగా పనిచేస్తున్నారు. దీంతో భార్య వరంగల్ లో.. భర్త గుజరాత్ తీరంలో ఉండడంతో వీరి ఎడబాటు కొనసాగింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచే ఆమ్రపాలి తనను కేంద్ర సర్వీసుల్లోకి మార్చాలని కేంద్రానికి అర్జీ పెట్టుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించింది. అయితే అది వెంటనే కార్యరూపం దాల్చలేదు.

వరంగల్ అర్బన్ కలెక్టర్ గా తనదైన శైలిలో సుపరిపాలన అందించి అనతికాలంలోనే మంచి గుర్తింపును ఈ యువ ఐఏఎస్ అధికారిణి దక్కించుకున్నాడు. 2010 క్యాడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిణి మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జేసీగా, ఆ తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేశారు.

First Published:  28 Oct 2019 11:44 PM GMT
Next Story