Telugu Global
National

దీపావళి పై ఆర్థికమాంద్యం ప్రభావం

మనదేశంలో దీపావళి అతిపెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా కొనుగోళ్ళు కూడా విపరీతంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది దీపావళి పై ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా భారీగా పడింది. దేశంలో టపాసుల అమ్మకాలు ఈ ఏడాది 60 శాతం దాకా పడిపోయినట్టు ఒక అంచనా. వాతావరణ కాలుష్యం స్పృహ కొంతైతే… ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గత ఏడాది దేశం మొత్తం మీద ప్రజలు సుమారు 6 లక్షల […]

దీపావళి పై ఆర్థికమాంద్యం ప్రభావం
X

మనదేశంలో దీపావళి అతిపెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా కొనుగోళ్ళు కూడా విపరీతంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది దీపావళి పై ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా భారీగా పడింది.

దేశంలో టపాసుల అమ్మకాలు ఈ ఏడాది 60 శాతం దాకా పడిపోయినట్టు ఒక అంచనా. వాతావరణ కాలుష్యం స్పృహ కొంతైతే… ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే గత ఏడాది దేశం మొత్తం మీద ప్రజలు సుమారు 6 లక్షల కోట్ల రూపాయల బంగారం, వజ్రాలు గత దీపావళి సందర్భంగా కొనుగోలు చేశారు.

అదే ఈ ఏడాది దీపావళికి ఈ కొనుగోళ్ళు 3 లక్షల కోట్లకు పడిపోయాయని…. అంటే కొనుగోళ్ళు సుమారు 50 శాతంకు పైగా పడిపోయాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు కూడా మొదట భారీ ఎత్తున జరిగినా… తరువాత తరువాత ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు.

First Published:  28 Oct 2019 11:55 PM GMT
Next Story