Telugu Global
Cinema & Entertainment

మొన్న చరణ్ చెప్పాడు... ఇప్పుడు రెండు స్టోరీలు వినపడుతున్నాయి...

పాతికేళ్ల ప్లాన్ తో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్, మరోసారి సినిమాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అనే విషయం తేలిపోయింది. దీపావళి సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రామ్ చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టేశాడు. బాబాయ్ పవన్ కొన్ని కథలు వింటున్నాడని, మంచి స్టోరీ దొరికితే ముఖానికి రంగేసుకోవడం గ్యారెంటీ అని స్పష్టంచేశాడు. పవన్ రీ ఎంట్రీని చరణ్ నిర్థారించాడు. ఆ సినిమాలేంటనే విషయాన్ని మీడియా ఫిక్స్ చేసింది. అవును.. పవన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. […]

మొన్న చరణ్ చెప్పాడు... ఇప్పుడు రెండు స్టోరీలు వినపడుతున్నాయి...
X

పాతికేళ్ల ప్లాన్ తో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్, మరోసారి సినిమాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అనే విషయం తేలిపోయింది. దీపావళి సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రామ్ చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టేశాడు. బాబాయ్ పవన్ కొన్ని కథలు వింటున్నాడని, మంచి స్టోరీ దొరికితే ముఖానికి రంగేసుకోవడం గ్యారెంటీ అని స్పష్టంచేశాడు.

పవన్ రీ ఎంట్రీని చరణ్ నిర్థారించాడు. ఆ సినిమాలేంటనే విషయాన్ని మీడియా ఫిక్స్ చేసింది. అవును.. పవన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి క్రిష్ హ్యాండిల్ చేస్తున్న పీరియాడిక్ మూవీ. చిరంజీవికి సైరాలా పవన్ కు ఇది కెరీర్ లో నిలిచిపోతుందట. ప్రస్తుతం ఈ పనిమీదే క్రిష్ బిజీగా ఉన్నాడు. దాదాపు 2 నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు.

పవన్ దృష్టికి వచ్చిన మరో సినిమా పింక్ రీమేక్. హిందీ, తమిళ్ లో ఈ సినిమా ఇప్పటికే హిట్ అయింది. చిన్నచిన్న మార్పులు చేస్తే తెలుగులో కూడా హిట్ అయ్యే కంటెంట్ ఇది. కాకపోతే ఈ సినిమాకు దర్శకుడ్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. రీమేక్ ప్రాజెక్టు కాబట్టి పవన్ ఎవరి పేరు చెబితే అతడే దర్శకుడు. సో.. పవన్ లిస్ట్ లో ఈ 2 సినిమాలున్నాయి. వీటిలో దేనికి ఆయన ఓకే చేస్తాడు.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడనేది తేలాల్సి ఉంది.

First Published:  28 Oct 2019 8:42 PM GMT
Next Story