Telugu Global
Cinema & Entertainment

నవంబర్ 1.. రెండు డిఫరెంట్ సినిమాలు

ఈ వీకెండ్ రాబోతున్న రెండు సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పేరుకు అవి చిన్న సినిమాలే అయినప్పటికీ… జానర్, కంటెంట్, స్టార్ కాస్ట్, స్పెషల్ ఎట్రాక్షన్స్ కారణంగా ఆ రెండూ వేటికవే విభిన్నంగా నిలిచాయి. వాటిలో ఒకటి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా కాగా.. రెండోది ఆవిరి అనే మూవీ. ముందుగా మీకు మాత్రమే చెప్తా సినిమా విషయానికొద్దాం.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విజయ్ దేవరకొండ. అవును.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మెయిన్ స్ట్రీమ్ […]

నవంబర్ 1.. రెండు డిఫరెంట్ సినిమాలు
X

ఈ వీకెండ్ రాబోతున్న రెండు సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పేరుకు అవి చిన్న సినిమాలే అయినప్పటికీ… జానర్, కంటెంట్, స్టార్ కాస్ట్, స్పెషల్ ఎట్రాక్షన్స్ కారణంగా ఆ రెండూ వేటికవే విభిన్నంగా నిలిచాయి. వాటిలో ఒకటి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా కాగా.. రెండోది ఆవిరి అనే మూవీ.

ముందుగా మీకు మాత్రమే చెప్తా సినిమా విషయానికొద్దాం.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విజయ్ దేవరకొండ. అవును.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మెయిన్ స్ట్రీమ్ నిర్మాతగా మారాడు. అదే సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కాగా… మరో ఆకర్షణ ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారడం. ఈ సినిమాపై అందరూ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణాలు ఈ రెండే. వీటికి తోడు ట్రయిలర్ కూడా బాగుండడంతో కూసింత అంచనాలు పెరిగాయి. ఈరోజు దీనికి సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి.

ఇక ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న మరో సినిమా ఆవిరి. రవిబాబు ఈ సినిమాకు దర్శకుడు, ఇందులో హీరో కూడా ఇతడే. రవిబాబు సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ఆవిరి కూడా అలాంటిదే. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ చూసిన తర్వాత ఆవిరి ఎలాంటిదనే విషయంపై అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.

టీజర్ తోనే భయపెట్టిన రవిబాబు, సినిమాతో మరింత భయం కలిగించడం గ్యారెంటీ. పైగా ఈ సినిమాపై నమ్మకంతో దిల్ రాజు దీన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇలా ఆవిరి, మీకు మాత్రమే చెప్తాను అనే 2 సినిమాలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

First Published:  30 Oct 2019 2:10 AM GMT
Next Story