Telugu Global
CRIME

కీర్తి క్రిమినల్ ఎందుకయ్యింది?

తండ్రి శ్రీనివాస్ రెడ్డి… ఓ లారీ డ్రైవర్. తల్లి నీరజ… గృహిణి. వీరికి ఒక్కతే కూతురు కీర్తి. తల్లిదండ్రులు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. అమెరికాలో స్థిరపడేలా చూడాలని కలలు కన్నారు. అయితే, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఆ అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ లోనే ప్రేమ వ్యవహారం నడిపితే గొడవలయ్యాయి. ఇప్పుడు సెకండియర్ లో మరో అబ్బాయితో ప్రేమ పేరుతో తిరుగుతోంది ఆ కూతురు. ఈ విషయం బయటకొస్తే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఆలోచించి, […]

కీర్తి క్రిమినల్ ఎందుకయ్యింది?
X

తండ్రి శ్రీనివాస్ రెడ్డి… ఓ లారీ డ్రైవర్. తల్లి నీరజ… గృహిణి. వీరికి ఒక్కతే కూతురు కీర్తి. తల్లిదండ్రులు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. అమెరికాలో స్థిరపడేలా చూడాలని కలలు కన్నారు.

అయితే, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఆ అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ లోనే ప్రేమ వ్యవహారం నడిపితే గొడవలయ్యాయి. ఇప్పుడు సెకండియర్ లో మరో అబ్బాయితో ప్రేమ పేరుతో తిరుగుతోంది ఆ కూతురు. ఈ విషయం బయటకొస్తే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఆలోచించి, తప్పు చేయవద్దని కూతురిని మందలించి, ప్రవర్తన మార్చుకొమ్మని హెచ్చరించిందా తల్లి.

దీంతో బాగా కోపం పెంచుకొని, తల్లిని చున్నీతో ఉరి వేసి చంపి శవం ఇంట్లో ఉండగానే ప్రియుడితో మూడు రోజులు గడిపి, తర్వాత కారులో శవాన్ని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టి, అందరినీ నమ్మించిందంటే.. ఆ కూతురు ఇంత క‌సాయిగా ఎలా మారింది అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. చివరకు తండ్రినే అందరూ అనుమానించేలా.. నీ గొడవల వల్లే తల్లి చనిపోయిందంటూ తప్పుడు నిందలేసి బలి పశువును చెయ్యాలని కూడా చూసింది .

కూతురుని అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లి దిక్కు లేని చావు చనిపోయింది. కనీసం శవం కూడా సరైన దహన సంస్కారానికి నోచు కోలేదు. ఇక తండ్రి బతికిఉన్న శవమే. ఆ క్రిమినల్ కూతురికి కనీసం పదేళ్లు జైలు జీవితం. అంటే మొత్తం ఒక కుటుంబం నాశనం.

కీర్తి పేరు పెట్టుకున్న కూతురు తల్లినే చంపి ఇంతటి అపకీర్తి ఎందుకు తెచ్చింది? అంటే ఈ కేసులో కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

సొంత కూతురే తల్లిని చంపేలా… ఆమె ప్రియుడే ప్రేరేపించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

కీర్తికి బాల్‌రెడ్డితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. త్వ‌ర‌లోనే పెళ్లి చేయాల‌ని అనుకున్నారు. అయితే కీర్తి ఇంటి ప‌క్క‌నే ఉండే శ‌శి కుమార్‌…కీర్తిపై మ‌న‌సు ప‌డ్డాడు. శ‌శి తండ్రి విద్యుత్ శాఖ ఏఈ. ఆయ‌నకు ముగ్గురు భార్య‌లు. మూడో భార్య సంతానమే శశి. తండ్రి ఈ మ‌ధ్య‌నే లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. తండ్రి లంచావ‌త‌రం. కొడుకు ప్రేమ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల వేసి… లోబరుచుకోవడమే ల‌క్ష్యం.

త‌ల్లిదండ్రులు త‌రుచూ గొడ‌వ‌ల‌తో…. నిరాద‌ర‌ణ‌కు గురైన కీర్తిని శ‌శి ప‌థ‌కం ప్ర‌కారం లొంగదీసుకున్నాడు. ఆస్తి బాగా ఉంద‌ని బిల్డ‌ప్ ఇవ్వ‌డంతో కీర్తి న‌మ్మేసింది. దీంతో ఆమెతో స‌న్నిహితంగా ఉండే వీడియోలను తీసి… ఆమెను బెదిరించ‌డం మొద‌లెట్టాడు.

కీర్తిని త‌న‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని త‌ల్లి ర‌జితని బెదిరించాడు. ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో..కీర్తిని బ్లాక్‌మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. కీర్తి పెళ్లి చేసుకోబోతున్న బాల్‌రెడ్డికి కూడా ఈ వీడియోలను చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్‌ ఎలా చెబితే అలా చేయడం మొదలుపెట్టింది కీర్తి.

ఇందులో భాగంగానే శశికుమార్‌ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై ఇద్ద‌రూ క‌లిసి ప‌డేశారు.

మొత్తానికి శ‌శి ట్రాప్‌లో ప‌డ్డ కీర్తి ఇప్పుడు అప‌కీర్తి మూట‌గ‌ట్టుకుంది. కీర్తికి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో అబార్ష‌న్ చేయించిన ఆసుప‌త్రితో పాటు శ‌శికి స‌హ‌క‌రించిన ఇత‌ర నిందితులెవ‌రు? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచార‌ణ‌ మొద‌లుపెట్టారు.

First Published:  30 Oct 2019 12:07 AM GMT
Next Story