Telugu Global
NEWS

మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే పంచాయతీ ఎన్నికల నగార మోగబోతోంది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసి చాలా కాలం అయినా ఏపీలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల్ హైకోర్టులో పిల్ వేశారు. దీన్ని విచారించిన చీఫ్‌ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ […]

మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు
X

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే పంచాయతీ ఎన్నికల నగార మోగబోతోంది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసి చాలా కాలం అయినా ఏపీలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల్ హైకోర్టులో పిల్ వేశారు. దీన్ని విచారించిన చీఫ్‌ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ … మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఏపీలో సర్పంచుల పదవీకాలం గతేడాది ఆగస్ట్ ఒకటితోనే ముగిసింది. కానీ ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం సానుకూలత చూపలేదు. ప్రత్యేకాధికారులతో పాలన సాగిస్తూ వచ్చింది.

First Published:  30 Oct 2019 7:13 PM GMT
Next Story