Telugu Global
National

ఐదేళ్లు ఆహార దీక్ష... ఐదు గంటలు నిరాహార దీక్ష

విశాఖ భూ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాస్తవాలను వెలికితీసి దోషులను శిక్షిస్తామన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… విశాఖ ల్యాండ్ స్కాం పై గత సిట్ ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉందన్నారు. టీడీపీ నేతలను కాపాడేందుకు వాస్తవాలను దాచిపెట్టేలా నివేదిక ఉందన్నారు. నవంబర్‌ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత ఐదేళ్లూ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాన్ని కూడా మరిచిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. బెంజిసర్కిల్‌లో […]

ఐదేళ్లు ఆహార దీక్ష... ఐదు గంటలు నిరాహార దీక్ష
X

విశాఖ భూ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాస్తవాలను వెలికితీసి దోషులను శిక్షిస్తామన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… విశాఖ ల్యాండ్ స్కాం పై గత సిట్ ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉందన్నారు. టీడీపీ నేతలను కాపాడేందుకు వాస్తవాలను దాచిపెట్టేలా నివేదిక ఉందన్నారు.

నవంబర్‌ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత ఐదేళ్లూ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాన్ని కూడా మరిచిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. బెంజిసర్కిల్‌లో దీక్షలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే చంద్రబాబు 68వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో విశాఖకు మహర్ధశ రాబోతోందని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ కేంద్రంగా అపారమైన అభివృద్ధి జరగబోతోందన్నారు. తప్పుడు కథనాలు రాసే మీడియా సంస్థలపై మాత్రమే కేసులు పెడుతామన్నారు. నిజాయితీగా పనిచేసే మీడియా సంస్థలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

జర్నలిస్ట్ విలువలకు కట్టుబడి ఉంటే ఇబ్బందులేమీ ఉండవన్నారు. కానీ ఏపీలో మాత్రం కొన్ని పత్రికలు, టీవీలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన విడిపోయి పని చేస్తున్నాయని… ఇది దురదృష్టకరమైన పరిణామం అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

వార్త రాస్తే దానికి ఆధారం ఉండాలని సూచించారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా ఉంటే తాము ఆహ్వానిస్తామన్నారు. అలా కాకుండా పనిగట్టుకుని, వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడే చర్యలు ఉంటాయన్నారు.

మీడియా యాజమాన్యాల తీరు ఎలా ఉన్నా… జర్నలిస్టుల విషయంలో మాత్రం జగన్‌ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది తమ ప్రభుత్వం నుంచి ఉండబోదన్నారు.

పవన్ కల్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు దత్తపుత్రుడు లాంటి వారన్నారు. రెండు చోట్ల పోటీ చేసిన దత్తపుత్రుడు రెండు చోట్లా ఓడిపోయాడన్నారు. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు జేబులో వ్యక్తి అన్నది ఎన్నికలకు ముందే అందరికీ తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు తీసుకున్న దత్తపుత్రుడి పొలిటికల్ కాల్‌షీట్లు ఇంకా ఉన్నాయని… అందుకే అప్పుడప్పుడు వచ్చి సినిమా పోజులు ఇస్తుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

చంద్రబాబుకు అసలు పుత్రుడు లోకేష్ అయితే… పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు ఆహార దీక్ష చేసిన పప్పునాయుడు.. నిన్న ఐదు గంటల పాటు నిరాహారదీక్ష చేశారని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వల్ల లోకేష్ ఒక్క గ్రాము కూడా తగ్గి ఉండరని వ్యాఖ్యానించారు.

First Published:  31 Oct 2019 6:26 AM GMT
Next Story