హాట్ బాంబ్ గా మారబోతున్న తెలుగు పిల్ల

టాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది తెలుగు మాట్లాడే హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. మొన్నటివరకు ఓ మోస్తరు గ్లామరస్ పాత్రలు మాత్రమే పోషించింది ఈషా రెబ్బా. అయితే ఈసారి గ్లామర్ లో తన విశ్వరూపం చూపించబోతోంది. ఓ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ప్రదర్శించబోతోంది.

అవును.. సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ లో నటించడానికి ఇషా రెబ్బా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ కైరా అద్వానీకి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తీసుకొచ్చింది ఈ వెబ్ సిరీస్. ఇందులో కైరా పోషించిన బోల్డ్ పాత్ర సూపర్ హిట్ అయింది. కట్ చేస్తే ఆ తర్వాత కైరా తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడీ సిరీస్ తెలుగులోకి వస్తోంది.

కాకపోతే లస్ట్ స్టోరీస్ ను కాస్తా లవ్ స్టోరీస్ గా మార్చేశారు. పేరుకు లవ్ అని ఉన్నప్పటికీ కాస్త శృంగారం పాళ్లు ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఇందులో ఓ ఎపిసోడ్ లో ఈషా రెబ్బా హాట్ గా కనిపించబోతోంది. కొన్ని రొమాంటిక్ సీన్లలో కూడా నటించబోతోంది. ఈ ఎపిసోడ్ ను ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీయబోతున్నాడు. త్వరలోనే ప్రేక్షకులు ఈషా రెబ్బా హాట్ హాట్ అందాల విందును చూడబోతున్నారన్నమాట.