Telugu Global
NEWS

ఒలింపిక్స్ అర్హతకు చేరువగా భారత హాకీజట్లు

తొలిఅంచె పోటీలలో భారత జట్ల విజయాలు రష్యాపై 4-2 గోల్స్ తో భారత పురుషుల జట్టు గెలుపు అమెరికాపై 5-1తో మహిళల జట్టు గెలుపు టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ పోటీలలో భారత పురుషుల, మహిళల జట్లు తొలి అంచె విజయాలు సాధించాయి. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం  వేదికగా ముగిసిన తొలి అంచె పోటీలలో విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో 5వ ర్యాంకర్ భారత్ 4-2 గోల్స్ తో 22వ ర్యాంకర్ రష్యాను అధిగమించింది. ఆట […]

ఒలింపిక్స్ అర్హతకు చేరువగా భారత హాకీజట్లు
X
  • తొలిఅంచె పోటీలలో భారత జట్ల విజయాలు
  • రష్యాపై 4-2 గోల్స్ తో భారత పురుషుల జట్టు గెలుపు
  • అమెరికాపై 5-1తో మహిళల జట్టు గెలుపు

టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ పోటీలలో భారత పురుషుల, మహిళల జట్లు తొలి అంచె విజయాలు సాధించాయి. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి అంచె పోటీలలో విజేతలుగా నిలిచాయి.

పురుషుల విభాగంలో 5వ ర్యాంకర్ భారత్ 4-2 గోల్స్ తో 22వ ర్యాంకర్ రష్యాను అధిగమించింది. ఆట 24, 53 నిముషాలలో మన్ దీప్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ సాధించగా.. 5వ నిముషంలో హర్మన్ ప్రీత్ సింగ్, 48వ నిముషంలో సునీల్ చెరో గోల్ సాధించి…తమ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన మన్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మహిళల అలవోక గెలుపు…

అంతకుముందు… కళింగ స్టేడియం వేదికగానే ముగిసిన మహిళల తొలి అంచెపోరులో రాణీ రాంపాల్ నాయకత్వంలోని భారతజట్టు 5-1 గోల్స్ తో అమెరికాను చిత్తు చేసి.. ఒలింపిక్స్ బెర్త్ కు గెలుపు దూరంలో నిలిచింది.

ఆట మొదటిభాగం 15వ నిముషంలో తొలిగోలు సాధించిన భారత్… రెండోగోల్ ను 45వ నిముషంలో నమోదు చేసింది. భారత్ తరపున లిలిమా, గుర్జీత్ కౌర్,నవనీత్ కౌర్, షర్మిలా దేవి గోల్స్ సాధించారు.

ఈ రోజు జరిగే రెండో అంచె పోటీలలో తిరిగి భారత పురుషుల, మహిళల జట్లు తమ ప్రత్యర్థులతో తలపడనున్నాయి.

First Published:  1 Nov 2019 9:00 PM GMT
Next Story