Telugu Global
Cinema & Entertainment

ఖైదీకి 5 కోట్లు

ఓ సినిమాకు మౌత్ టాక్ కలిసొస్తే ఎలా ఉంటుందో నిరూపించింది ఖైదీ సినిమా. మొదటి రోజు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేవల 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కానీ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ బాగా నడిచింది. దీంతో ఏడో రోజుకు ఈ సినిమా ఏకంగా 5 కోట్ల రూపాయలకు చేరుకుంది. అవును.. ఓవర్సీస్ వసూళ్లతో కలుపుకొని ఖైదీ సినిమాకు అక్షరాలా 5 కోట్ల రూపాయలు వచ్చాయి. […]

ఖైదీకి 5 కోట్లు
X

ఓ సినిమాకు మౌత్ టాక్ కలిసొస్తే ఎలా ఉంటుందో నిరూపించింది ఖైదీ సినిమా. మొదటి రోజు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేవల 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కానీ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ బాగా నడిచింది. దీంతో ఏడో రోజుకు ఈ సినిమా ఏకంగా 5 కోట్ల రూపాయలకు చేరుకుంది. అవును.. ఓవర్సీస్ వసూళ్లతో కలుపుకొని ఖైదీ సినిమాకు అక్షరాలా 5 కోట్ల రూపాయలు వచ్చాయి.

30 లక్షల రూపాయల షేర్ నుంచి వారం తిరిగేసరికి 5 కోట్లకు వచ్చిందంటే.. ఖైదీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సూపర్ హిట్ టాక్ రావడంతో.. నైజాంలో రెండో రోజు నుంచే ఖైదీకి అమాంతం థియేటర్లు పెంచారు. అటు ఉత్తరాంధ్రలో కూడా తన థియేటర్లకు ఈ సినిమాకే కేటాయించారు నిర్మాత దిల్ రాజు. అలా ఖైదీ సినిమా తెలుగులో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 7 రోజుల్లో ఖైదీ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.12 కోట్లు
సీడెడ్ – రూ. 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.64 కోట్లు
ఈస్ట్ -రూ. 0.38 కోట్లు
వెస్ట్ – రూ. 0.25 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.21 కోట్లు
కృష్ణా – రూ. 0.39 కోట్లు

First Published:  1 Nov 2019 7:02 PM GMT
Next Story