Telugu Global
National

ఆర్టీసీ సమస్యకు కేసీఆర్ కన్నడ పరిష్కారం?

రోజురోజుకు ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె.. కార్మికుల మరణాలతో అలెర్ట్ అయిన కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్షకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీ సమస్యను తేల్చేయాలని స్పష్టం చేస్తున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హైకోర్టు కూడా దీనిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నారని తెలిసింది. తెలంగాణ ఆర్టీసీని ప్రక్షాళన చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. కర్ణాటక మోడల్ ను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. కర్ణాటకలో లాగా తెలంగాణ […]

ఆర్టీసీ సమస్యకు కేసీఆర్ కన్నడ పరిష్కారం?
X

రోజురోజుకు ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె.. కార్మికుల మరణాలతో అలెర్ట్ అయిన కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్షకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీ సమస్యను తేల్చేయాలని స్పష్టం చేస్తున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హైకోర్టు కూడా దీనిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నారని తెలిసింది.

తెలంగాణ ఆర్టీసీని ప్రక్షాళన చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. కర్ణాటక మోడల్ ను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. కర్ణాటకలో లాగా తెలంగాణ ఆర్టీసీని కూడా మూడు భాగాలుగా చేయడానికి రెడీ అయ్యారు.

కర్ణాటకలో ఆర్టీసీని బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, ఈశాన్య రోడ్డు రవాణా సంస్థ, వాయువ్య రోడ్డు రవాణా సంస్థగా విభజించి మూడు సంస్థలు పోటాపోటీగా.. నిలిపారు. ఉద్యమాలు, సమ్మెలకు ఆస్కారం లేకుండా దేనిది దానికి విభజించి లాభాలను పంచిపెడుతున్నారు.

ఇదే తరహాలో తెలంగాణ లో కూడా మూడు కార్పొరేషన్లు చేయడానికి కేసీఆర్ రెడీ అయినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణ ఆర్టీసీ, దక్షిణ తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మహానగరానికి మరొకటి ఆర్టీసీని మూడు విభాగాలకు విభజించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

ఇక అద్దె బస్సుల శాతాన్ని పెంచడానికి రెడీ అయ్యారు. ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ కూడా హైదరాబాద్ లో ఆర్టీసీకి నిధులు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

First Published:  2 Nov 2019 1:00 AM GMT
Next Story