తమిళనాట రంగస్థలం.. హీరో ఎవరో తెలుసా?

రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమా తమిళ్ లోకి కూడా డబ్ అయింది. అయితే అక్కడ సరిగ్గా ఆడలేదు. ఇప్పుడీ సినిమా తమిళ్ లో నేరుగా రీమేక్ అవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. తమిళ రంగస్థలం రీమేక్ లో లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. లింగుస్వామి డైరక్ట్ చేయబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది రంగస్థలం. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. కొన్ని రికార్డులు కూడా సృష్టించింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను లారెన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. కోటిన్నర మొత్తానికి మైత్రీ నిర్మాతల నుంచి లారెన్స్ ఈ రీమేక్ రైట్స్ పొందినట్టు సమాచారం.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా డైరక్ట్ చేస్తున్నాడు లారెన్స్. కాంచన సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మీబాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అక్షయ్ కుమార్, కైరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు లారెన్స్.

ఈ గ్యాప్ లో రంగస్థలం సబ్జెక్ట్ కు లింగుస్వామి తనదైన స్టయిల్ లో మార్పుచేర్పులు చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. లారెన్స్, లింగుస్వామి నిర్మాతలుగా సెట్స్ పైకి రాబోతోంది రంగస్థలం తమిళ రీమేక్.