Telugu Global
Cinema & Entertainment

కేఏ పాల్ తో బాహుబలి 3... ఇన్వాల్వ్ చేయవద్దని వర్మకు రాజమౌళి వినతి

రాజమౌళి.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తెలుగు దిగ్గజ దర్శకుడు. అయితే తన మానానికి తను సినిమాలు తీసుకుంటున్న రాజమౌళిని తాజాగా రాంగోపాల్ వర్మ టచ్ చేశాడు. దీనికి రాజమౌళి కూడా ఆసక్తికరంగా స్పందించాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీలో ఎన్నికల తరువాత నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను విడుదల […]

కేఏ పాల్ తో బాహుబలి 3... ఇన్వాల్వ్ చేయవద్దని వర్మకు రాజమౌళి వినతి
X

రాజమౌళి.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తెలుగు దిగ్గజ దర్శకుడు. అయితే తన మానానికి తను సినిమాలు తీసుకుంటున్న రాజమౌళిని తాజాగా రాంగోపాల్ వర్మ టచ్ చేశాడు. దీనికి రాజమౌళి కూడా ఆసక్తికరంగా స్పందించాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీలో ఎన్నికల తరువాత నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో ఓ పాటను విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ. కేఏ పాల్ కు సంబంధించిన ఈ పాటను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో షేర్ చేస్తూ ‘ఇండియాలో జోకర్ సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే కేఏ పాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తీస్తే అది బాహుబలి3 కంటే భారీ విజయం సాధిస్తుంది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం వాషింగ్టన్ లో కేఏ పాల్ తో ఈ సినిమా విషయమై చర్చలు జరుపుతున్నట్టు విన్నాను. ఈ విషయం కేఏపాల్ తనకు ఫోన్ చేసి స్వయంగా చెప్పారు’ అంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

దీనికి రాజమౌళి కూడా స్పందించాడు.. ‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజు గారు’ అంటూ సినిమా డైలాగ్ ను ట్వీట్ చేసి వర్మకు సరదా కౌంటర్ ఇచ్చాడు.

దీనికి వర్మ కూడా స్పందించాడు. ‘నేను ఇన్వాల్వ్ చేయడం కాదు సార్. ట్రంప్ టవర్ లో మీరు, కేఏ పాల్ కలిసి లంచ్ చేశారని.. బాహుబలి3 కోసం అతడితో సంతకం పెట్టించుకున్నారని కేఏపాల్ నాకు చెప్పాడని.. కావాలంటే కేఏపాల్ మీద ఒట్టు’ అని వర్మ బదులిచ్చాడు.

రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దానికి రాజమౌళి స్పందించడం విశేషం.

First Published:  2 Nov 2019 9:24 AM GMT
Next Story