సైరా నష్టాల లెక్కలివే!

విడుదల రోజు బాహుబలితో పోల్చారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ మూవీ అన్నారు. ఆ తర్వాత ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటి అన్నారు. ఆ తర్వాత చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అన్నారు.

ఇలా సైరా సినిమా తగ్గుతూ తగ్గుతూ వచ్చి చివరాఖరికి ఫ్లాప్ అనిపించుకుంది. అవును.. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఫ్లాప్. ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఫైనల్ రన్ లో ఈ సినిమాకు 43 కోట్ల 45 లక్షల రూపాయల నష్టం తేలింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాను 187 కోట్ల రూపాయలకు అమ్మారు. సినిమా ఫైనల్ రన్ లో 188 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంటే టెక్నికల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. కానీ ఏరియా వైజ్ చూసుకుంటే ఈ సినిమా బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఉత్తరాంధ్ర, నైజాం మినహా ఎక్కడా ఈ సినిమా లాభాల బాట పడ్డలేదు.

ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 105 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాం, ఉత్తరాంధ్రలో మాత్రమే కాస్తోకూస్తో లాభాలు వచ్చాయి. మిగతా అన్ని ఏరియాల్లో నష్టాలే. అలా సైరా హంగామా ముగిసింది.

ప్రస్తుతం కీలకమైన మార్కెట్ ఏరియాల్లో ఈ సినిమా ఎక్కడా లేదు. అక్టోబర్ 2న విడుదలైన సైరా సినిమా ఫైనల్ కలెక్షన్ ఇలా ఉంది

నైజాం – రూ. 32.10 కోట్లు
సీడెడ్ – రూ. 19 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 16.80 కోట్లు
ఈస్ట్ – రూ. 8.35 కోట్లు
వెస్ట్ – రూ. 6.65 కోట్లు
గుంటూరు – రూ. 9.70 కోట్లు
నెల్లూరు – రూ. 4.65 కోట్లు
కృష్ణా – రూ. 7.70 కోట్లు