అప్ కమింగ్ ప్రాజెక్టులపై క్లారిటీ

ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతానికి జనాలకు తెలిసినవి ఈ రెండు సినిమాలే. అయితే వీటితో పాటు మరో రెండు సినిమాలున్నాయంటున్నాడు ఈ హీరో. తన అప్ కమింగ్ మూవీ వివరాల్ని వెల్లడించాడు.

“వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ ఇంకో 8 రోజులుంది. ఆ తర్వాత మైత్రీ బ్యానర్ లో చేస్తున్న హీరో అనే సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను. అది కంప్లీట్ చేసి జనవరి నుంచి పూరి గారి దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. దానికి బల్క్ లో కాల్షీట్లు ఇచ్చాను. ఫైటర్ కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా మొదలుపెడతా. ఫైటర్ కంప్లీట్ అయిన తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తా.”

ఈ క్రమంలో తను మధ్యలో ఆపేసిన హీరో అనే సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు దేవరకొండ. యాక్షన్ సన్నివేశాలకు చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని, అందుకే ఆ సినిమా లేట్ అవుతుందని, అంతే తప్ప ప్రాజెక్టు ఆగిపోలేదని స్పష్టంచేశాడు. ఈ సినిమాలన్నీ ఏడాదిన్నర గ్యాప్ లో థియేటర్లలోకి వస్తాయని స్పష్టంచేశాడు.