అల వైకుంఠపురములో యూరోప్

మొన్నటివరకు హైదరాబాద్ లోనే భారీ సెట్ లో షూటింగ్ చేశారు. ఇంకా చెప్పాలంటే సినిమా టాకీ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. ఓ భారీ భవనం సెట్ వేసి, అందులోనే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తిచేశారు. ఇప్పుడు పాటల కోసం యూరోప్ వెళ్లింది అల వైకుంఠపురములో యూనిట్. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య ఓ మంచి రొమాంటిక్ సాంగ్ ను అక్కడ పిక్చరైజ్ చేయబోతున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు పాటల షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఓ పాట కోసం యూరోప్ వెళ్లారు. యూరోప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ మేకింగ్ విజువల్స్ తో పాటు లిరికల్ వీడియోను రిలీజ్ చేయాలనేది ప్లాన్. మూడో పాట కూడా హిట్ అయితే, సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటినట్టే.

ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. డిసెంబర్ మొదటి వారం నాటికి టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది కాబట్టి.. డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది బన్నీ సినిమా.