వాళ్లు యూరోప్.. వీళ్లు కేరళ

సంక్రాంతి బరిలో పోటీపడుతున్న మహేష్, అల్లు అర్జున్ తమ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల యూనిట్లు ఔట్ డోర్ షూట్ ప్లాన్ చేశాయి. అల వైకుంఠపురములో యూనిట్ యూరోప్ వెళ్తే.. సరిలేకు నీకెవ్వరు యూనిట్ కేరళకు రెడీ అవుతోంది.

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఓ సాంగ్ ను యూరోప్ లోని కొన్ని దేశాల్లో తీయబోతున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో ఈ సాంగ్ తీస్తారు. దీని తర్వాత రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ సెట్ లో మరో సాంగ్ తీస్తారు. ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ మూడో వారానికి సినిమాను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

ఇటు సరిలేరు నీకెవ్వరు సినిమా అయితే బన్నీ మూవీ కంటే ఫాస్ట్ గా ఉంది. కేరళలో ఇవాళ్టి నుంచి ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. పక్కా ప్రీ-ప్రొడక్షన్ తో అనీల్ రావిపూడి, ఈ సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. డిసెంబర్ మొదటివారానికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. జనవరి మొదటి వారానికి ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నాడు. మహేష్ కెరీర్ లో బిజినెస్ మేన్ తర్వాత అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఇదే.