మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోతుంది

బిగ్ బాస్ సీజన్-3 పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వంద ఎపిసోడ్లుగా అలరిస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు క్లైమాక్స్ కు చేరింది. విజేత ఎవరనేది ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తేలిపోతుంది. మరోవైపు ఈ కార్యక్రమంలో విజేత ఎవరనే అంశంపై రకరకాల లీక్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓ వర్గం అయితే ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ ను విజేతగా ప్రకటించగా.. మరోవర్గం మాత్రం శ్రీముఖిని విజేతగా ప్రకటిస్తూ సంబరాలు చేసుకుంటోంది.

ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా నాగార్జున రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరనే అంశంపై వస్తున్న లీకుల్లో ఎలాంటి నిజం లేదంటున్నాడు నాగ్. ఈరోజు రాత్రి కార్యక్రమం లైవ్ గా ఉంటుందని, రికార్డింగ్ కాదని స్పష్టంచేశాడు. సో.. విజేత ఎవరనే విషయం ముందుగా బయటకొచ్చే ఛాన్స్ లేదంటున్నాడు నాగ్.

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువమంది రాహుల్ సిప్లిగంజ్ కే ఓటేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన లీకులు ఆధారంగానే ఎలిమినేషన్స్ జరిగాయి. సోషల్ మీడియాలో ఎవరు చెబితే, ఆ వారం వాళ్లే ఎలిమినేట్ అయ్యారు. అంత పక్కాగా ఉన్నాయి లీక్స్.

సో..ఆఖరినిమిషంలో వచ్చిన ఈ లీక్స్ కూడా పక్కా అంటున్నారు చాలామంది. ఏ విషయం ఈరాత్రికే తేలిపోతుంది. బిగ్ బాస్ విజేతకు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతోంది స్టార్ మా యాజమాన్యం.