Telugu Global
NEWS

టోక్యో ఒలింపిక్స్ కు భారత హాకీజట్ల అర్హత

రష్యాపై 11-3తో భారత పురుషుల జట్టు గెలుపు అమెరికాపై 6-5తో భారత మహిళల విజయం టోకో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సంపాదించాయి. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం వేదికగా ముగిసిన ఒలింపిక్స్ అర్హత పోటీలలో భారతజట్లు విజయాలు సాధించాయి. గట్టెక్కిన భారత మహిళలు…. అమెరికాతో ముగిసిన రెండంచెల పోరులో భారత్ 6-5 గోల్స్ తేడాతో నెగ్గి…వరుసగా రెండోసారి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. […]

టోక్యో ఒలింపిక్స్ కు భారత హాకీజట్ల అర్హత
X
  • రష్యాపై 11-3తో భారత పురుషుల జట్టు గెలుపు
  • అమెరికాపై 6-5తో భారత మహిళల విజయం

టోకో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సంపాదించాయి. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం వేదికగా ముగిసిన ఒలింపిక్స్ అర్హత పోటీలలో భారతజట్లు విజయాలు సాధించాయి.

గట్టెక్కిన భారత మహిళలు….

అమెరికాతో ముగిసిన రెండంచెల పోరులో భారత్ 6-5 గోల్స్ తేడాతో నెగ్గి…వరుసగా రెండోసారి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

అమెరికాజట్టుతో ముగిసిన డబుల్ లెగ్ తొలిమ్యాచ్ లో 5-1 గోల్స్ తో నెగ్గిన భారత్ కు ..24 గంటల విరామం తర్వాత జరిగిన రెండో లెగ్ పోటీలో పరాజయం తప్పలేదు.

రెండో అంచెపోటీలో అమెరికా చెలరేగి ఆడి 4-1 గోల్స్ తో విజేతగా నిలిచినా…ఓవరాల్ గా 5-6 గోల్స్ తో పరాజయం తప్పలేదు. ఒక దశలో అమెరికా చెలరేగి ఆడి.. ఆట మొదటి భాగానికే 4-0 గోల్స్ తో పైచేయి సాధించింది. భారత్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. అయితే… ఆట రెండో భాగంలో భారత్ పోరాడి ఆడి… ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా నిలువరించింది.

భారత్ ఒలింపిక్స్ అర్హతకు అవసరమైన గోల్ ను కెప్టెన్ రాణి రాంపాల్ సాధించిపెట్టింది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరిసారిగా పాల్గొన్న భారత మహిళల జట్టు.. ఆ తర్వాత 36 ఏళ్ల విరామం తర్వాతకానీ…రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించగలిగింది.

అంతేకాదు…2020 టోక్యో ఒలింపిక్స్ లో సైతం బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. ప్రపంచ మహిళా హాకీలో 9వ ర్యాంకర్ గా ఉన్న భారత్ గత 18 మాసాలుగా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడం ద్వారా… టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగింది.

21వసారి భారత పురుషుల అర్హత…

ఒలింపిక్స్ పురుషులహాకీలో ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించగిలిగింది. డబుల్ లెగ్ అర్హత పోటీలో 5వ ర్యాంకర్ భారత్ 11-3 గోల్స్ తో 22వ ర్యాంకర్ రష్యాను చిత్తు చేసింది.

శుక్రవారం ముగిసిన తొలి అంచె పోటీలో రష్యా పై 4-2 గోల్స్ తో నెగ్గిన భారత్…రెండో అంచె పోటీలో విశ్వరూపమే ప్రదర్శించింది. ఏకంగా 7-1 గోల్స్ తో భారీవిజయం సాధించింది.

రెండో అంచె పోటీ తొలినిముషంలోనే రష్యా మెరుపుగోల్ సాధించినా …ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఆట 17వ నిముషంలో లలిత్ ఉపాధ్యాయ ఈక్వలైజర్ సాధించగా..ఆట 23, 29 నిముషాలలో ఆకాశ్ దీప్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ గోల్స్ తో ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు.

47వ నిముషంలో నీలకంఠ శర్మ నాలుగో గోల్ సాధించగా…డ్రాగ్ ఫ్లిక్కర్ రూపిందర్ పాల్ సింగ్ ఆట 48, 59 నిముషాలలో పెనాల్టీకార్నర్లను గోల్స్ గా మలచి భారత స్కోరును 6-1కి చేర్చాడు.

ఆట ముగిసే క్షణాలలో రాహీదాస్ గోల్ చేయడంతో భారత్ 7-1 గోల్స్ విజయంతో …టోక్యో ఒలింపిక్స్ టికెట్ ఖరారు చేసుకోగలిగింది.

21వసారి ఒలింపిక్స్ కు అర్హత….

ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిదిసార్లు బంగారు పతకాలు గెలుచుకొన్న భారత హాకీజట్టు…21వసారి ..ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. 1980 బీజింగ్ ఒలింపిక్స్ కు మాత్రమే అర్హత సాధించడంలో విఫలమైన భారత్…ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

First Published:  2 Nov 2019 9:00 PM GMT
Next Story