Telugu Global
National

కేసీఆర్‌ ఆఖరి డెడ్‌లైన్

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో డెడ్‌లైన్ పెట్టారు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా బేషరుతుగా విధుల్లో చేరాలని కోరారు. అలా చేరిన కార్మికులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. యూనియన్ల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఆలోచించుకోవాలన్నారు. నష్టం జరిగిపోయాక కార్మికులకు యూనియన్లు గానీ, రాజకీయ పార్టీలు గానీ అండగా ఉండవని టాటా చెప్పేసి వెళ్లిపోతాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల జీవితాలను నాశనం చేసే […]

కేసీఆర్‌ ఆఖరి డెడ్‌లైన్
X

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో డెడ్‌లైన్ పెట్టారు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా బేషరుతుగా విధుల్లో చేరాలని కోరారు. అలా చేరిన కార్మికులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. యూనియన్ల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఆలోచించుకోవాలన్నారు.

నష్టం జరిగిపోయాక కార్మికులకు యూనియన్లు గానీ, రాజకీయ పార్టీలు గానీ అండగా ఉండవని టాటా చెప్పేసి వెళ్లిపోతాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల జీవితాలను నాశనం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని అందుకే ఈనెల 5లోగా విధుల్లో చేరేందుకు కార్మికులకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.

ఒకవేళ అలా చేరకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందన్నారు. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే బసులన్నీ ప్రైవేట్‌కు అప్పగిస్తామని కేసీఆర్ చెప్పారు. కార్మికులకు ఇదో మంచి అవకాశం అని మంగళవారం అర్థరాత్రిలోగా విధుల్లో చేరాలని కోరారు.

తాము అవకాశం ఇస్తున్నామని… ఇక దాన్ని వినియోగించుకోకపోతే తప్పు కార్మికులదే అవుతుందన్నారు. ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని స్పష్టంచేశారు. నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచామని… దేశంలో ఎక్కడా కూడా ఇది జరగలేదన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అన్నది అసాధ్యమని… ఆ చర్చకే అవకాశం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 5100 ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ రంగానికి ఇవ్వాలని కూడా కేబినేట్ నిర్ణయించినట్టు కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతం 10,400 సర్వీసులు ఉండగా, ఇందులో 2,100 అద్దె బస్సులు ఉన్నాయని… మిగిలిన 8,300 బస్సుల్లో 2,609 బస్సుల కాలం చెల్లి.. ఉపయోగంలో లేవన్నారు. రాబోయే 3, 4 నెలల్లో మరో నాలుగైదు వందల బస్సులు కూడా కాలం చెల్లేలా ఉన్నాయని… . ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొని, నడిపే సామర్ద్యం ఆర్టీసీకి లేనందున మొత్తంగా 5,100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు.

భవిష్యత్తులో యూనియన్ల బ్లాక్‌మెయిల్‌కు అవకాశం ఉండకూదన్నారు. పరీక్షల సమయంలో, పండుగల సమయంలో సమ్మె చేసి ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి ఇకపై ఉండకూడదన్నారు. సమ్మెల వల్ల రాష్ట్ర బ్రాండ్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని… కాబట్టి అందుకే ఆర్టీసీలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్న ఉద్దేశంతో ప్రైవేట్‌కు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ప్రైవేట్‌ బస్సులు వచ్చినా వారు ఇష్టానుసారం చార్జీలు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేతిలోనే నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

First Published:  2 Nov 2019 9:05 PM GMT
Next Story