పవన్ పై ట్వీట్ వివాదం…. క్లారిటీ ఇచ్చిన పూనమ్ కౌర్

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. ‘ఒక అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కావచ్చు… కానీ నిజమైన నాయకుడు కాలేడు’ అని ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది.

ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిందో పూనమ్ కౌర్ చెప్పలేదు. అయితే పూనమ్ చేసిన ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేసిందని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ కూడా జరిగింది.

గతంలో పూనమ్ కౌర్-పవన్ విషయంలో కత్తి మహేష్ చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న పూనమ్ కౌర్ తాజాగా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే తన ట్వీట్ దుమారం రేపడంతో పూనమ్ కౌర్ తాజాగా మరో ట్వీట్ లో క్లారిటీ ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవి కాదని.. సాధారణంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తన అవగాహన మేరకు స్పందించాని చెప్పుకొచ్చింది. పవన్ ను ఉద్దేశించి తప్పుడు రాతలు రాసిన మీడియాపై మండిపడింది.

పూనమ్ మరో ట్వీట్ లో తన వ్యాఖ్యలు పవన్ గురించి కాదని క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఈ వివాదాన్ని వదిలేశారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ట్వీట్ వార్ కు ఇంతటితో పుల్ స్టాప్ పడింది.