Telugu Global
NEWS

రగ్బీ ప్రపంచ విజేత సౌతాఫ్రికా

ఫైనల్లో ఇంగ్లండ్ కు సఫారీల షాక్ న్యూజిలాండ్ కు కాంస్య పతకం జపాన్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ రగ్బీ చాంపియన్షిప్ ను సౌతాఫ్రికా గెలుచుకొని సంచలనం సృష్టించింది. కండబలం, గుండెబలం దండిగా అవసరమైన ఈ బలాఢ్యుల క్రీడలో మొత్తం 20 దేశాలకు చెందిన జట్లు నాలుగు గ్రూపులుగా తలపడితే… సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు టైటిల్ సమరానికి అర్హత సంపాదిస్తే.. మాజీ చాంపియన్ న్యూజిలాండ్, వేల్స్ జట్లు కాంస్య పతకం పోటీలో మిగిలాయి. సఫారీల అలవోక గెలుపు… యోకాహామా వేదికగా […]

రగ్బీ ప్రపంచ విజేత సౌతాఫ్రికా
X
  • ఫైనల్లో ఇంగ్లండ్ కు సఫారీల షాక్
  • న్యూజిలాండ్ కు కాంస్య పతకం

జపాన్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ రగ్బీ చాంపియన్షిప్ ను సౌతాఫ్రికా గెలుచుకొని సంచలనం సృష్టించింది. కండబలం, గుండెబలం దండిగా అవసరమైన ఈ బలాఢ్యుల క్రీడలో మొత్తం 20 దేశాలకు చెందిన జట్లు నాలుగు గ్రూపులుగా తలపడితే… సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు టైటిల్ సమరానికి అర్హత సంపాదిస్తే.. మాజీ చాంపియన్ న్యూజిలాండ్, వేల్స్ జట్లు కాంస్య పతకం పోటీలో మిగిలాయి.

సఫారీల అలవోక గెలుపు…

యోకాహామా వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో సౌతాఫ్రికా 32-12 తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో…సౌతాఫ్రికా పవర్ గేమ్ ముందు.. ఇంగ్లండ్ నిలువలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా, సెమీఫైనల్లో న్యూజిలాండ్ లాంటి మేటిజట్లను అధిగమించిన ఇంగ్లండ్…ఫైనల్లో మాత్రం సఫారీల ముందు తేలిపోయింది.

ప్రపంచ కప్ ఫైనల్స్ కు నాలుగుసార్లు చేరుకొన్న ఇంగ్లండ్ కు ఇది మూడో ఓటమి. సౌతాఫ్రికా ప్రపంచ రగ్బీ టైటిల్ గెలుచుకోడం ఇది మూడోసారి.

1995లో తొలిసారి, 2007లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన సౌతాఫ్రికా..తిరిగి 12 సంవత్సరాల విరామం తర్వాత మూడో టైటిల్ అందుకోడం విశేషం.

పూల్-బీ లీగ్ లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందిన సౌతాఫ్రికాజట్టు చివరకు విజేతగా నిలవడం కూడా ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

కివీస్ కు కాంస్యం…

సెమీఫైనల్లో పరాజయాలు పొందిన న్యూజిలాండ్, వేల్స్ జట్ల మధ్య కాంస్య పతకం కోసం జరిగిన పోటీ సైతం…ఏకపక్షంగానే సాగింది. పవర్ ఫుల్ కివీజట్టు 40-17 పాయింట్ల తేడాతో వేల్స్ ను చిత్తు చేసింది.

1953 నుంచి వేల్స్ తో 35సార్లు తలపడిన న్యూజిలాండ్ కు ఇది 32వ విజయంగా రికార్డుల్లో చేరింది.

మొత్తం మీద…న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా జట్ల ఆధిపత్యానికి గండి కొట్టి రెండుసార్లు చాంపియన్ సౌతాఫ్రికా మూడోసారి విశ్వవిజేత కావడం 2019 ప్రపంచ రగ్బీకే హైలైట్ గా మిగిలిపోతుంది.

First Published:  2 Nov 2019 7:44 PM GMT
Next Story