ప్రజలు తాట తీశారు… పడుకోబెట్టారు… వంగోబెట్టారు… గుర్తు లేదా పవన్?

విశాఖ వేదికగా ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్… ఆ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చాయి. ఇసుక కొరత తీర్చకపోతే రాజధాని అమరావతిలోనే లాంగ్ మార్చ్ చేస్తానని పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే.

ఇక సీఎం జగన్ పై ఘాటైన విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి, కన్నబాబులను తిట్టిపోశారు. దీనిపై తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.

మాట్లాడితే తాట తీస్తానని చెబుతున్న పవన్ కు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తీసిన తాట గుర్తులేదా అని అంబటి ఎద్దేవా చేశారు. ప్రజలే పవన్ కళ్యాణ్ తాటతీసి మూలన కూర్చుండబెట్టి, వంగోబెట్టి, పడుకోబెట్టిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు.

అమరావతిలో పవన్ కళ్యాణ్ దర్జాగా నడవవచ్చని…. మీ రాజకీయ మిత్రుడు అక్రమంగా నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా ఖాళీ చేయమని సలహా ఇవ్వు…. అంటూ పవన్ కు సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై పవన్ ఎందుకు స్పందించడని మండిపడ్డారు.

ఇక తాటతీయడం అంటే ఆర్నెళ్లకోసారి గడ్డం గీసినట్లు కాదని పవన్ పై మండిపడ్డారు అంబటి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కౌంటర్ ఇచ్చారు.

జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదివాడని విమర్శించారు.