Telugu Global
NEWS

ఢిల్లీ టీ-20లో భారత్ కు బంగ్లా షాక్

భారత్ పై ఎట్టకేలకు బంగ్లా విజయం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ ను ఓడించాలన్న బంగ్లాదేశ్ కల ఎట్టకేలకు నెరవేరింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో 5వ ర్యాంకర్ భారత్ పై సంచలన విజయం సాధించింది. రోహిత్ శర్మకు చేదు అనుభవం… ఆస్ట్ర్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు […]

ఢిల్లీ టీ-20లో భారత్ కు బంగ్లా షాక్
X
  • భారత్ పై ఎట్టకేలకు బంగ్లా విజయం

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ ను ఓడించాలన్న బంగ్లాదేశ్ కల ఎట్టకేలకు నెరవేరింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో 5వ ర్యాంకర్ భారత్ పై సంచలన విజయం సాధించింది.

రోహిత్ శర్మకు చేదు అనుభవం…

ఆస్ట్ర్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ బరిలోకి స్టాండిన్ కెప్టెన్ గా దిగిన రోహిత్ శర్మకు..చేదు అనుభవం ఎదురయింది.

తన కెరియర్ లో 99వ మ్యాచ్ ఆడటం ద్వారా ధోనీ పేరుతో ఉన్న 98 మ్యాచ్ ల రికార్డును, విరాట్ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డులను అధిగమించినా.. బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమితో డీలా పడకతప్పలేదు.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో పవర్ ఫుల్ భారత్ ను 6 వికెట్లకు 148 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే అవుట్ కాగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ముష్ ఫికుర్ మ్యాజిక్…

149 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ప్రారంభఓవర్లలోనే ఓపెనర్ లిట్టన్ దాస్ వికెట్ కోల్పోయినా…మహ్మద్ నైమ్- సౌమ్య సర్కార్…రెండో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.

నైమ్ 26,సౌమ్య సర్కార్ 39 పరుగులకు అవుట్ కాగా…మాజీ కెప్టెన్ ముష్ ఫికుర్ రహీం 60, కెప్టెన్ మహ్మదుల్లా 15 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచారు.

మరో మూడుబంతులు మిగిలిఉండగానే తమజట్టుకు సంచలన విజయం అందించారు. 7 వికెట్లతో నెగ్గి బంగ్లాదేశ్ మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

భారత్ 8-1 రికార్డు…

ప్రస్తుత టీ-20వరకూ బంగ్లాదేశ్ తో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. స్టార్ ప్లేయర్లు షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లేకుండానే.. భారత్ ను బంగ్లా కంగుతినిపించడం విశేషం.

43 బాల్స్ లో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 60 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన ముష్ ఫికుర్ రహీం కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని రెండో టీ-20 నవంబర్ 7న రాజ్ కోట స్టేడియం వేదికగా జరుగనుంది.

First Published:  3 Nov 2019 7:54 PM GMT
Next Story