ఫార్ములావన్ లో లూయి హామిల్టన్ డబుల్ హ్యాట్రిక్

  • ఆరోసారి ప్రపంచ టైటిల్ నెగ్గిన హామిల్టన్

గంటకు 360 కిలోమీటర్ల వేగంతో సాగిపోయే ఫార్ములావన్ 2019 సీజన్ ప్రపంచ టైటిల్ ను సైతం… టీమ్ మెర్సిడెస్ కమ్ బ్రిటీష్ రేసర్ లూయి హామిల్టన్ గెలుచుకొన్నాడు.

34 ఏళ్ల హామిల్టన్ తన కెరియర్ లో ఆరోసారి ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా జర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ మైకేల్ షుమాకర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఏడుసార్లు ఫార్ములావన్ విశ్వవిజేతగా నిలిచిన అరుదైన రికార్డు మైకేల్ షుమాకర్ పేరుతోనే ఉంది. ఇప్పడు హామిల్టన్ 6వ ప్రపంచ టైటిల్ తో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆస్టిన్ వేదికగా ముగిసిన యూఎస్ గ్రాండ్ ప్రీ రేస్ లో హామిల్టన్ రెండోస్థానంలో నిలవడం ద్వారా ఆరోసారి ప్రపంచ టైటిల్ ఖాయం చేసుకొన్నాడు.

టీమ్ మెర్సిడెస్ కే చెందిన వాల్టెర్రీ బొట్టాస్ ప్రధమస్థానంలో నిలిచాడు. రెడ్ బుల్ రేసర్ మాక్స్ వెర్ స్టాపన్ మూడోస్థానంతో సరిపెట్టుకొన్నాడు.