రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నాని

కెరీర్ లో తన 25వ చిత్రంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. యాక్షన్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్టు తెలిపాడు నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘V’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.

నాని ఇందులో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా, మరికొన్ని సందర్భాల్లో నెగెటివ్ షేడ్స్ లో అతని పాత్ర కనిపిస్తుందట. ఇందులో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో నాని సరసన అదితిరావు, సుధీర్ బాబు సరసన నివేత ధామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ గతంలో ఇంద్రగంటి దర్శకత్వంలో పనిచేసిన వాళ్లే.

అన్నట్టు నాని ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ‘V’ ప్రాజెక్టు కొలిక్కి రావడంతో అతడు శివ నిర్వాణ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో నిన్నుకోరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు నాని-శివనిర్వాణ సినిమా ప్రారంభం అవుతుంది.