మెగా ఫ్యామిలీతో విభేదాలపై స్పందించిన రాంగోపాల్ వర్మ

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీకి, తనకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను వర్మ ఖండించారు. తనకు మెగా ఫ్యామిలీతో ఎలాంటి విభేదాలు లేవని.. అదంతా తప్పుడు ప్రచారమేనని చెప్పుకొచ్చారు.

ఐలవ్ చిరంజీవి అని.. పవన్ కళ్యాణ్ ను ఎప్పటికైనా సీఎంగా చూడాలన్నదే తన తపన అని వర్మ చెప్పుకొచ్చాడు. నాగబాబు తనపై చేసిన విమర్శల గురించి కూడా పట్టించుకోనని తెలిపారు. పవన్ జనసేన తరుఫున కష్టపడుతున్నా ఆయన చుట్టూ ఉన్న టీం బాగాలేదని వర్మ వివరించారు.

వేదికలపై పవన్ కళ్యాణ్ ప్రసంగాలు తనను ఉద్వేగానికి గురిచేస్తాయని.. అలా ఎవరూ మాట్లాడలేరని వర్మ చెప్పుకొచ్చాడు. పవన్ ఒక్కడే జనసేనలో బలంగా ఉన్నారని.. మిగతా వారంతా డమ్మీనేనని వివరించారు.

అయితే సడన్ గా రాంగోపాల్ వర్మ ఇలా ఫ్లేట్ ఫిరాయించి పవన్ ను ఆకాశానికి ఎత్తడం వెనుక మతలబు ఏమిటా? అని ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు.

తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీస్తున్న వర్మ అందులో చంద్రబాబు, పవన్ లను విలన్ లుగా చూపించాడని టాక్ నడుస్తోంది. పవన్ పై ఈ సినిమాలో సెటైర్లు కూడా వేసిన వర్మ… ఇప్పుడు సడన్ గా ఇలా పొగడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చూడాలి మరి దీని వెనుక మతలబు ఏంటో..?