Telugu Global
NEWS

మరి ఆ ఇద్దరి బదిలీ సంగతేంటి బాబు?

పాలన సౌలభ్యం కోసం ఎల్‌వి సుబ్రమణ్యంను బదిలీ చేయగా.. విపక్ష నేత చంద్రబాబు మాత్రం తీవ్రంగా స్పందించారు. ఈ బదిలీ అమానవీయమని వ్యాఖ్యానించారు. కాకపోతే చంద్రబాబు కూడా తన హయంలో ఇద్దరు సీఎస్‌లను బదిలీ చేశారు. ఆనందరావు, స్వామినాథన్‌ అనే ఇద్దరు సీఎస్‌లను హఠాత్తుగా వేరే చోటికి బదిలీ చేశారు. తాను చెప్పినట్టు వినలేదని కోపంతో ఆనందరావును, తనను ఇబ్బంది పెట్టేలా కేంద్రానికి నివేదిక పంపారన్న కోపంతో స్వామినాథన్‌ను చంద్రబాబు తప్పించారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్‌లు […]

మరి ఆ ఇద్దరి బదిలీ సంగతేంటి బాబు?
X

పాలన సౌలభ్యం కోసం ఎల్‌వి సుబ్రమణ్యంను బదిలీ చేయగా.. విపక్ష నేత చంద్రబాబు మాత్రం తీవ్రంగా స్పందించారు. ఈ బదిలీ అమానవీయమని వ్యాఖ్యానించారు. కాకపోతే చంద్రబాబు కూడా తన హయంలో ఇద్దరు సీఎస్‌లను బదిలీ చేశారు. ఆనందరావు, స్వామినాథన్‌ అనే ఇద్దరు సీఎస్‌లను హఠాత్తుగా వేరే చోటికి బదిలీ చేశారు.

తాను చెప్పినట్టు వినలేదని కోపంతో ఆనందరావును, తనను ఇబ్బంది పెట్టేలా కేంద్రానికి నివేదిక పంపారన్న కోపంతో స్వామినాథన్‌ను చంద్రబాబు తప్పించారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్‌లు జోక్యం చేసుకున్నా బాబు వినలేదు. అప్పట్లో మీడియా ఏకపక్షం కావడంతో చంద్రబాబు ఇద్దరు సీఎస్‌లపై వేటేసినా పెద్దగా చర్చ జరగలేదు.

ఇప్పుడు మాత్రం ఎల్‌వీ సుబ్రమణ్యం బదిలీతో ఆకాశం బద్ధలైనట్టు చంద్రబాబు, ఆయన మీడియా గగ్గోలు పెడుతున్నాయి. నేరుగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న కీలక అధికారికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం ద్వారా, ముఖ్యమంత్రినే ప్రశ్నించే తరహాలో వ్యవహరించడం ద్వారా ఎల్‌ వీ సుబ్రమణ్యం తానే తన కిందకు నీళ్లు తెచ్చుకున్నారని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

First Published:  5 Nov 2019 3:40 AM GMT
Next Story