Telugu Global
NEWS

దేవధర్ ట్రోఫీ విజేత ఇండియా-బీ

ఫైనల్లో ఇండియా-సీ జట్టుపై గెలుపు జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే దేవధర్ ట్రోఫీని…పార్థివ్ పటేల్ నాయకత్వంలోని ఇండియా-బీ జట్టు గెలుచుకొంది. రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో యువఆటగాడు శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని ఇండియా- సీ జట్టును 51 పరుగులతో ఇండియా-బీ జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇండియా-బీ జట్టును కేదార్ జాదవ్, యశస్వి జైస్వాల్ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో ఆదుకొన్నారు. […]

దేవధర్ ట్రోఫీ విజేత ఇండియా-బీ
X
  • ఫైనల్లో ఇండియా-సీ జట్టుపై గెలుపు

జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే దేవధర్ ట్రోఫీని…పార్థివ్ పటేల్ నాయకత్వంలోని ఇండియా-బీ జట్టు గెలుచుకొంది. రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో యువఆటగాడు శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని ఇండియా- సీ జట్టును 51 పరుగులతో ఇండియా-బీ జట్టు చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇండియా-బీ జట్టును కేదార్ జాదవ్, యశస్వి జైస్వాల్ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో ఆదుకొన్నారు. కేదార్ జాదవ్ 86, జైస్వాల్ 54, విజయ్ శంకర్ 45 పరుగులు సాధించడంతో…50 ఓవర్లలో 7 వికెట్లకు 283 పరుగుల స్కోరు సాధించింది.

సమాధానంగా 284 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇండియా-సీ జట్టు 9 వికెట్లకు 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ అగర్వాల్ 28, ప్రియం గార్గ్ 74 పరుగులు సాధించారు.

ఇండియా- బీ బౌలర్లలో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇండియా-బీ కెప్టెన్ పార్థివ్ పటేల్…దేవధర్ ట్రోఫీని అందుకొన్నాడు.

First Published:  4 Nov 2019 8:30 PM GMT
Next Story