పవన్ కోసం సెట్ వేస్తున్నారు

పవన్ మళ్లీ సినిమాలు చేస్తారా చేయరా.. చేస్తే ఎవరి దర్శకత్వంలో చేస్తారు.. నిర్మాత ఎవరు.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్క దెబ్బతో సమాధానం దొరికేసింది.

పవన్ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో సెట్ వేసే పనులు ప్రారంభమయ్యాయి. ఇది కోర్టు సెట్. దిల్ రాజు నిర్మాత. దీంతో పవన్ రీఎంట్రీ మూవీ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది.

అవును.. దిల్ రాజు బ్యానర్ లో పింక్ సినిమా రీమేక్ చేయబోతున్నాడు పవన్ కల్యాణ్. ఈ మూవీ కోసమే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సెట్ పూర్తయిన తర్వాత వీలు చూసుకొని పవన్ కాల్షీట్లు కేటాయిస్తాడు. ఈ గ్యాప్ లో దర్శకుడు ఎవరనేది నిర్ణయిస్తారు. దిల్ రాజు నుంచి వేణు శ్రీరామ్ పేరు ప్రతిపాదనలో ఉంది. పవన్ నుంచి దర్శకుడు డాలీ పేరు వినిపిస్తోంది. దర్శకుడు ఎవరనేది ఓకే అయిన తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

మరోవైపు తన రీఎంట్రీపై పవన్ కూడా పరోక్షంగా స్పందించారు. రాజకీయాల్లో ఉంటూనే అవంతి శ్రీనివాస్ కాలేజీలు నడిపిస్తున్నారని, జగన్ కు భారతి సిమెంట్స్ తదితర వ్యాపారాలు ఉన్నాయని.. అలాంటప్పుడు తనకు జీవనాధారం అయిన సినిమాలు చేస్తే తప్పేంటని పవన్ అన్నారు. సో.. పవన్ రీఎంట్రీ ఫిక్స్ అయింది. సినిమా ఏంటనేది తేలిపోయింది. ఇక లాంఛింగ్ డేట్ ఒక్కటే పెండింగ్ అన్నమాట.