Telugu Global
NEWS

మహిళా టెన్నిస్ నంబర్ వన్ బార్టీ

2019 సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించిన బార్టీ ఆస్ట్ర్రేలియా సంచలనం యాష్లీగా బార్టీ 2019 సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించడంతో పాటు బంపర్ ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది. షెన్ జాన్ వేదికగా ముగిసిన సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీలో బార్టీ విజేతగా నిలిచింది. టైటిల్ సమరంలో ఎలెనా స్వితోలినాను 6-4, 6-3తో చిత్తు చేయడం ద్వారా బార్టీ ట్రోఫీతో పాటు…40 లక్షల యూరోల ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది. మొత్తం […]

మహిళా టెన్నిస్ నంబర్ వన్ బార్టీ
X
  • 2019 సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించిన బార్టీ

ఆస్ట్ర్రేలియా సంచలనం యాష్లీగా బార్టీ 2019 సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించడంతో పాటు బంపర్ ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది.

షెన్ జాన్ వేదికగా ముగిసిన సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీలో బార్టీ విజేతగా నిలిచింది.

టైటిల్ సమరంలో ఎలెనా స్వితోలినాను 6-4, 6-3తో చిత్తు చేయడం ద్వారా బార్టీ ట్రోఫీతో పాటు…40 లక్షల యూరోల ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది.

మొత్తం 7 వేల 851 పాయింట్లతో ప్రపంచ మహిళా టెన్నిస్ నంబర్ వన్ గా నిలిచింది.

కారోలినా ప్లిసికోవా 5వేల 940 పాయింట్లతో రెండోర్యాంకులో కొనసాగుతోంది. 5వేల 496 పాయింట్లతో నవోమీ ఒసాకా మూడు, సిమోనా హాలెప్ నాలుగు, బియాంకా యాండ్రెస్కూ ఐదు, ఎలెనా స్వితోలినా ఆరు ర్యాంకుల్లో ఉన్నారు.

పెట్రా క్విటోవా 7, బెలిండా బెసిచ్ 8, కికీ బార్టెన్స్ 9, సెరెనా విలియమ్స్ 10 ర్యాంకుల్లో నిలిచారు.

First Published:  5 Nov 2019 9:32 PM GMT
Next Story