బస్సులు తగలబెడుతాం – సీపీఐ నారాయణ

సీపీఐ నేత నారాయణ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రైవేట్ బస్సులు తిప్పితే తగలబెడతామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు నడపలేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రైవేట్ బస్సులు నడిపితే వాటిని రోడ్లపైనే తగలబెడుతామని నారాయణ హెచ్చరించారు.

కేసీఆర్‌ కావాలంటే అతడి ఫాంహౌజ్‌ను, ఇంటిని అమ్ముకోవాలని… ఆర్టీసీ జోలికి మాత్రం రావొద్దన్నారు. ఆర్టీసీ కేసీఆర్‌ సొంత ఆస్తి కాదని నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కార్మికులకు కేసీఆర్‌ డెడ్‌లైన్‌ పెట్టారని.. కానీ అది కేసీఆర్‌కే డైడ్‌లైన్ అవుతుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటి కొడుకు కంటే ఇంటి అల్లుడి పెత్తనం ఎక్కువైందన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆ పేరుతో పిలవాలన్నా మనసు రావడం లేదన్నారు. పువ్వాడ అంటే సీనియర్ కమ్యూనిస్ట్‌ నాయకుడని.. అలాంటి వ్యక్తి వంశంలో పువ్వాడ అజయ్ చెడ పుట్టాడని నారాయణ వ్యాఖ్యానించారు.