నిశ్శబ్దం టీజర్ భయంకరం

పేరుకే నిశ్శబ్దం, టీజర్ మాత్రం భయంకరంగా ఉంది. ఇదేదో నెగెటివ్ అర్థంతో చెప్పింది కాదు. హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. అనుష్క నటించిన ఈ సినిమాలో నిజానికి దెయ్యాలు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇది హారర్ సినిమా అనే విషయాన్ని టీజర్ తోనే స్పష్టంచేశారు మేకర్స్. రేపు అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ కు సంబంధించి మరో షాక్ కూడా ఉంది. సాధారణంగా టీజర్ లో మెయిన్ పాత్రను మాత్రమే చూపిస్తారు. సినిమా కథ, జానర్ ఏంటనేది పెద్దగా టచ్ చేయరు. కానీ నిశ్శబ్దం టీజర్ లో మాత్రం మొత్తం చెప్పారు. అనుష్క మూగమ్మాయిగా కనిపించనుందనే విషయం చెప్పేశారు. సినిమా జానర్ చెప్పేశారు. అంతేకాదు, అనుష్కతో పాటు కీలక పాత్రలన్నింటినీ టీజర్ లోనే పరిచయం చేసేశారు. ఇంకా చెప్పాలంటే ఇది మినీ ట్రయిలర్ లా ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంస్థలపై తెరకెక్కుతున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు, కోనవెంకట్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించాడు. గోపీసుందర్ సంగీత దర్శకుడు. హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

Here's #NishabdhamTeaser https://t.co/bfwGlarrQq #Nishabdham

Posted by Anushka Shetty on Wednesday, 6 November 2019