ట్రయిలర్ అదిరింది.. నెక్ట్స్ ఏంటి?

రాగల 24 గంటల్లో.. టైటిల్ తోనే కూసింత ఆసక్తి రేకెత్తించిన సినిమా ఇది. ఇలా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు ట్రయిలర్ తో కూడా దుమ్ముదులిపింది. 24 గంటల్లో ఓ పెళ్లి.. ఓ హత్య. ఇలా పొంతనలేని రెండు జానర్స్ ను కలుపుతూ ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. అంతేకాదు, తొలిసారిగా ఈషా రెబ్బా, ఈ సినిమాలో ఫిమేల్ ఓరియంటెడ్ పాత్ర పోషించింది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.

శ్రీనివాసరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ట్రయిలర్ ను రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. ఈ జానర్ లో సినిమా చేయడం శ్రీనివాసరెడ్డికి ఇదే ఫస్ట్ టైమ్. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీరామ్, ముస్కాన్ సేథీ కీలక పాత్రలు పోషించారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించాడు.

శ్రీనివాస కానూరు నిర్మించిన ఈ సినిమాలో బలమైన పాయింట్ ఉందంటున్నాడు దర్శకుడు. నటుడు కృష్ణభగవాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. ఈ సినిమాకు మాటలు అందించడం విశేషం. నవంబర్ 15న థియేటర్లలోకి వస్తోంది రాగల 24 గంటల్లో.