Telugu Global
NEWS

31 వ పడిలో భారత కెప్టెన్ కొహ్లీ

భూటాన్ లో పుట్టినరోజు వేడుకలు అంతైఇంతై అంతింతైన విరాట్ 239 వన్డేల్లో 43 శతకాలు 11వేల 520 పరుగులు 82 టెస్టుల్లో 26 సెంచరీలు 7వేల 66 పరుగులు 72 టీ-20ల్లో 22 హాఫ్ సెంచరీలు 2వేల 450 పరుగులు భారత కెప్టెన్, ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఆటగాడు విరాట్ కొహ్లీ మూడుపదుల వయసు దాటి..31వ పడిలో ప్రవేశించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్  టీ-20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకొన్న కొహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలసి […]

31 వ పడిలో భారత కెప్టెన్ కొహ్లీ
X
  • భూటాన్ లో పుట్టినరోజు వేడుకలు
  • అంతైఇంతై అంతింతైన విరాట్
  • 239 వన్డేల్లో 43 శతకాలు
  • 11వేల 520 పరుగులు
  • 82 టెస్టుల్లో 26 సెంచరీలు
  • 7వేల 66 పరుగులు
  • 72 టీ-20ల్లో 22 హాఫ్ సెంచరీలు
  • 2వేల 450 పరుగులు

భారత కెప్టెన్, ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఆటగాడు విరాట్ కొహ్లీ మూడుపదుల వయసు దాటి..31వ పడిలో ప్రవేశించాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకొన్న కొహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలసి భూటాన్ లో తన పుట్టినరోజు వేడుకలను ప్రశాంతంగా జరుపుకొన్నాడు.

ప్రకృతి అందాలకు, స్వచ్ఛతకు, ప్రశాంతతకు మరో పేరైన భూటాన్ లోయలో హాయిగా గడిపాడు.

11 సంవత్సరాలలో రికార్డులే రికార్డులు…

జీవితంలో మాత్రమే కాదు…క్రికెట్ ప్రయాణంలోనూ..ఎంతటి సుదూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దానికి ప్రపంచ మేటి బ్యాట్స్ మన్, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ గత 11 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనం.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్…ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణించడంలో కొహ్లీకి కొహ్లీ మాత్రమే సాటి.

పరుగుల యంత్రం… రికార్డుల మంత్రం…

2008 ఆగస్టు 18న శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ… భారత ఓపెనర్ గా తన కెరియర్ మొదలు పెట్టి… మొట్టమొదటి ఇన్నింగ్స్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఆ మరుసటి ఏడాదే వన్డే క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించిన విరాట్ కొహ్లీ ఆ తరువాత వెనుదిరిగి చూసింది లేదు. సౌతాఫ్రికాతో ఇటీవలే ముగిసిన టెస్ట్ సిరీస్ వరకూ 239 వన్డే మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 43 సెంచరీలతో 11వేల 520 పరుగులు సాధించాడు. అత్యంత వేగంగా 10వేలు, 20వేల పరుగుల మైలురాళ్లు చేరిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

82 టెస్టుమ్యాచ్ ల్లో 7వేల 66 పరుగులు, 72 టీ-20 మ్యాచ్ ల్లో 2వేల 450 పరుగులు సాధించిన ఘనత విరాట్ కొహ్లీకి ఉంది.

అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ గా విరాట్ కొహ్లీ కొనసాగుతున్నాడు.
వన్డే క్రికెట్లో మరో ఏడు శతకాలు బాదగలిగితే…మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును కొహ్లీ అధిగమించగలుగుతాడు.

టెస్టుల్లో 26 సెంచరీలు, వన్డేల్లో 43 శతకాలు, టీ-20ల్లో 22 హాఫ్ సెంచరీలు సాధించిన కొహ్లీ…ఇప్పటికే డజనుకు పైగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

రానున్న కాలంలో కొహ్లీ ఇదేజోరు, నిలకడను కొనసాగించగలిగితే… క్రికెటర్ గా విరాట్ స్వరూపం చూపెడతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  6 Nov 2019 5:18 AM GMT
Next Story