ఖుషీని గుర్తుచేసిన భీష్మ

హీరో నితిన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో పవన్ ను అనుకరించాడు నితిన్. తాజాగా పవన్ సూపర్ హిట్ మూవీ తొలిప్రేమలోని ఓ పాటను కూడా రీమిక్స్ చేశాడు. ఇలా పవన్ కు వీరాభిమానిగా కొనసాగుతున్న నితిన్, ఇప్పుడు పవన్ నటించిన ఓ హిట్ సినిమా సీన్ ను కూడా రిపీట్ చేశాడు.

ఖుషీలో నడుము సీన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నువ్వు నా నడుము చూశావ్ అంటుంది భూమిక. నేను చూడలేదంటాడు పవన్. అక్కడ్నుంచే సినిమాలో ట్విస్ట్ మొదలవుతుంది. ఇప్పుడు భీష్మ సినిమాలో కూడా దాదాపు అదే సీన్ ఉంది. రష్మిక నడుము చూస్తూ సంబరపడిపోతాడు నితిన్. సడెన్ గా ఆ విషయాన్ని రష్మిక గమనిస్తుంది. ఈ సన్నివేశాలతో ఈరోజు భీష్మ ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేసిన యూనిట్.. భీష్మ సినిమాను ఫిబ్రవరి 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు డేట్ కూడా ప్రకటించింది. వీడియోలో రష్మిక అందంగా, నితిన్ రొమాంటిక్ గా ఉన్నారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.