ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

తెలంగాణ ఆర్టీసీపై కఠినంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారును హైకోర్టు నిలదీసింది. ఈ సమ్మెను పరిష్కరించే ఉద్దేశం అసలు ప్రభుత్వానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోలేదా అని కడిగేసింది.

ఈ ఆర్టీసీ సమ్మె విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సమర్పించిన నివేదికలపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. విచారణను ఈనెల 11న తేదీకి వాయిదావేసింది.

ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికుల కోసం సమ్మె విరమించేందుకు తాత్కాలికంగా రూ.47 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు కోరినా ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక కేంద్రం తరుఫున లాయర్ కూడా వాదించారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదించలేదని.. నిధులు కూడా ఏమీ ఇవ్వలేదని తెలిపారు.

ప్రభుత్వంతోపాటు కార్మిక సంఘాల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. మానవతా ధృక్పథంతో పనిచేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.