తహసీల్దార్‌ పై దాడి చేసిన సురేష్ మృతి

తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడు సురేష్ చనిపోయాడు. విజయారెడ్డిపై దాడి చేసిన సమయంలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో సురేష్ శరీరం 65 శాతం కాలిపోయింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చారు.

తొలి రోజు కొద్ది మేర మాట్లాడిన సురేష్ ఆ తర్వాత మాట్లాడలేకపోయాడు.  అతడి నుంచి మరణవాంగ్మూలం కూడా తీసుకున్నారు. మంటలకు సురేష్ మెదడు, గుండె దెబ్బతిన్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సురేష్ మృతితో ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్టు అయింది. విజయారెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోగా… ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ ఆ తర్వాత ఆస్పత్రిలో చనిపోయాడు. ఇప్పుడు దాడి చేసిన సురేష్ కూడా చనిపోయాడు.