Telugu Global
NEWS

ఆదాయంలో సానుకూలంగా ఏపీ పరిస్థితి

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు రాష్ట్రాల ఆదాయంపైనా గట్టి ప్రభావమే చూపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆదాయం పడిపోయింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఏపీలో కొత్తగా పగ్గాలు చేపట్టిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పరిస్థితి తొలిరోజుల్లోనే సవాల్‌గా ఎదురైంది. అయితే ఆదాయ పరంగా ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరే కనబరుస్తోంది. మందగమనం కారణంగా గతేడాదితో పోలిస్తే 2 శాతం ఆదాయం తగ్గినా ఒవరాల్‌గా సంతృప్తికరంగానే ఉంది. వాణిజ్య పన్నుల ఆదాయం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల్లో గతేడాది […]

ఆదాయంలో సానుకూలంగా ఏపీ పరిస్థితి
X

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు రాష్ట్రాల ఆదాయంపైనా గట్టి ప్రభావమే చూపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆదాయం పడిపోయింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఏపీలో కొత్తగా పగ్గాలు చేపట్టిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పరిస్థితి తొలిరోజుల్లోనే సవాల్‌గా ఎదురైంది. అయితే ఆదాయ పరంగా ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరే కనబరుస్తోంది.

మందగమనం కారణంగా గతేడాదితో పోలిస్తే 2 శాతం ఆదాయం తగ్గినా ఒవరాల్‌గా సంతృప్తికరంగానే ఉంది. వాణిజ్య పన్నుల ఆదాయం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల్లో గతేడాది కంటే ఆదాయం పెరిగింది.

గతేడాది అక్టోబర్‌ వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2వేల 804 కోట్లు కాగా… ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఆదాయం 2వేల 895 కోట్లుగా ఉంది. అంటే గతేడాది కంటే 3. 26 శాతం ఆదాయం పెరిగింది.

వాణిజ్య పన్నుల ఆదాయం గతేడాదిలో అక్టోబర్ వరకు 24వేల 947 కోట్లుగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 24వేల 982 కోట్లుగా ఉంది. అంటే వాణిజ్య పన్నులు గతేదాడి కంటే 0.14 శాతం పెరిగింది.

మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆదాయం గతేడాదితో పోలిస్లే 8.91 శాతం తగ్గింది. రవాణా రంగంలో ఆదాయం 6. 83 శాతం తగ్గింది. అటవీ శాఖ ద్వారా గతేడాది అక్టోబర్‌ వరకు 131 కోట్ల ఆదాయం రాగా… ఈ ఏడాది అక్టోబర్ వరకు 28 కోట్లు మాత్రమే ఉంది. అటవీ ఆదాయంలో భారీ తరుగుదల ఉంది.

ఆర్థిక పరిస్థితి పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని… ఇది మంచి పరిణామమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం చేపట్టడం వల్ల లైసెన్స్ ఫీజును కోల్పోయామని అధికారులు వివరించగా… అయినా సరే మద్యం విషయంలో నియంత్రణ ఉండాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు.

ఆర్టీసీలో ఏసీ బస్సులను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. పేరుకుపోయిన ఎర్రచందనం నిల్వలకు అదనపు విలువ కట్టి విక్రయించాలని ఆదేశించారు. ఇసుకను నేరుగా ప్రభుత్వమే విక్రయించేలా పాలసీ తెచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి గనుల శాఖ ఆదాయం తగ్గినా… భవిష్యత్తులో పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

First Published:  7 Nov 2019 8:47 PM GMT
Next Story